అమృతం తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది.  వీకెండ్స్ మాత్రమే వచ్చే ఈ అమృతం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇద్దరు స్నేహితులు, ఇంటి ఓనర్ వారితో కలిసి అమృతం అనే ఆ హోటల్ సర్వర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఎక్కడా సాగతీత అనేది లేకుండా, జంధ్యాల తరహా హాస్యంతో.. వీరంతా పండించిన కామెడీ అభిమానులకు పొట్టచెక్కలైయ్యేలా నవ్వించింది. నిజానికి దూరదర్శన్ ఛానల్ మాత్రమే ఉన్న సమయంలో ఋతురాగాలు సీరియల్ ఎంత ఫేమస్ అయి ప్రేక్షకుల మదిని దోచిందో, అదే మాదిరిగా ఆ తరువాత జెమినీలో ప్రసారం అయిన కామెడీ సీరియల్ అమృతం కూడా మంచి పేరు దక్కించుకుంది.

 

ప్యూర్ అచ్చమైన కామెడీతో సాగే ఈ కల్ట్ క్లాసిక్ సీరియల్ దాదాపు ఏడేళ్ల పాటుగా కొనసాగి బ్రేక్ తీసుకుంది. దీనితో ఈ సీరియల్ ను బాగా మిస్సయిన వారంతా యూట్యూబ్ లో ఒక రౌండ్ వేసేసారు.కానీ తర్వాత ఈ వీడియోస్ అన్నిటిని జీ సంస్థకు చెందిన స్ట్రీమింగ్ యాప్ `జీ 5` వారు సొంతం చేసుకున్నారు.దీనితో పాటు `అమృతం` రెండో సీజన్ ను మొదలు పెడుతున్నామని ఓ తీపు క‌బురు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం తెలిసిన‌ తెలుగు ఆడియన్స్ మరోసారి ఆనందంలో మునిగారు.

 

ఇక ఇప్పటికే మొదలు పెట్టిన ఈ రెండో సీజన్ కు “అమృతం ద్వితీయం” గా పేరు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సీరియల్ ను ముందే ప్రీమియర్స్ గా చూసేందుకు ఈ సీరియల్ ను స్ట్రీమ్ చేయనున్న “జీ 5” వారు అధికారికంగా తెలియజేసారు.అమృతం సీరియల్ పై తమ వీక్షకులకు ఎంత ప్రేమ ఉందో దానిని ఓ వీడియో రూపంలో రూపొందించి “అమృతం అంటే మీ దృష్టిలో అర్ధం ఏమిటో” ఒక షార్ట్ వీడియో చేసి తమకు సోషల్ మీడియా ద్వారా పంపాలని అలా పంపిన వారిలో కొంతమందికి సెలెక్ట్ చేసి `అమృతం 2` ప్రీమియర్స్ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తామని తెలిపారు. కాబ‌ట్టి.. ఈ అవ‌కాశాలు అమృతం ప్రేమికులు అస్స‌లు మిస్‌కాకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: