బుల్లితెర‌పై అతి తక్కువ స‌మ‌యంలోనే ఓ రేంజ్‌లో పాపులర్ అయిన షో.. జబర్దస్త్ కామెడీ షో. ఏపీ, తెలంగాణలో ఏ టీవీ షోకు లేనంత హైప్‌ జ‌బ‌ర్ద‌స్త్ షోకు ఉంటుంది. ఇక టీఆర్పీ రేటింగ్స్‌ విషయంలోనూ ఈ కామెడీ షో ఎప్ప‌టిక‌ప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటుంది. మ‌రియు టిలివిజ‌న్‌పైనే కాకుండా యూట్యూబ్ లో సైతం ఈ షో కు సంబంధించిన‌ ప్రతీ ఎపిసోడ్ కు మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. ఈ షో మొదలై ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఈ షో క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మొద‌టిలో వారంలో ఒక్కరోజు మాత్రమే వచ్చే ఈ షో క్రమంగా వారంలో రెండు రోజులకు మారింది. 

 

టీమ్ లీడర్లు పెరిగారు, మరో యాంకర్ వచ్చి చేరింది. దీంతో బుల్లితెర ప్రేక్ష‌కులు ఈ షోల ద్వారా మ‌రింత వినోదాన్ని పొందుతున్నారు. ఇక ఇటీవ‌ల ఈ షోకు మెయిన్ పిల్ల‌ర్ అయిన న‌వ్వులు న‌వాబు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వెళ్లిపోవ‌డంతో అనేక వార్త‌లు, రూమ‌ర్లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ ఈ షో అదే టీఆర్పీ రేంటింగ్స్‌, అదే హైప్‌తో కొన‌సాగింది త‌ప్పా వెన‌క్కి త‌గ్గ‌లేదు. మ‌రోవైపు ఈ షో ను కొట్టడానికి ప్రత్యర్థి టీవీ ఛానల్స్ వాళ్ళు ఎన్ని షోస్ రూపొందించినా కూడా జబర్దస్త్ రేంజ్ లో సక్సెస్‌ను అందుకోలేక‌పోయాయి అన్న‌ది ఓపెన్ సీక్రెట్‌.

 

ఇక ఇదిలా ఉంటే.. వ‌చ్చే గురువారం ప్ర‌సారం కాబోయే జబర్దస్త్ ప్రోమోను తాజాగా విడుద‌ల చేశారు. దీని చూస్తుంటే.. హైపర్ ఆది వ‌న్ ఆఫ్ ద ఎట్రాక్ష‌న్‌గా న‌లిచాడు. ఈ ప్రోమోలో ఆది ఇంటర్నేషనల్ లెవల్ కు జబర్దస్త్ ను తీసుకెళ్లిపోయారు. ఇద్దరు ఇంగ్లీష్ అమ్మాయిలతో డాన్స్ చేస్తూ అటు రోజా మరియు అనసూయల మీద వేసిన పంచులు, చేసిన కామెడీ హిలేరియస్ గా న‌వ్విస్తాయి. ఈ క్ర‌మంలో ఆ ఇంగ్లీష్ భామ‌ల‌తో హైప‌ర్ ఆది స్కిట్‌లో ర‌చ్చ ర‌చ్చ చేశారు. అలాగే మిగిలిన టీం లీడ‌ర్ల స్కిట్లు కూడా అద్భుతంగా ఆక‌ట్టుకుంటాయ‌ని ప్రోమోను చూస్తేనే అర్థం అవుతుంది. కాబ‌ట్టి.. వ‌చ్చే జబర్దస్త్‌ను మాత్రం అస్స‌లు మిస్ కాకండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: