బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుని, సినీ రంగంలోనూ మంచి డైరెక్టర్ గా ఎదిగిన ఓంకార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. డాన్స్ రియాల్టీ షోతో బుల్లితెరమీద అన్నయ్య అని పిలిపించుకున్న ఓంకార్, ఆ షో ద్వారా ఎందరో టాలెంటెడ్ కొరియాగ్రాఫర్లను అందించాడు. మ‌రియు తన సొంత బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన షోలు అప్పట్లోనే ప్లాన్ చేశాడు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న  స్టార్ మాలో  సిక్త్స్‌ సెన్స్ సీజన్ 3 షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే.. మ‌రో రియాలిటీ షో స్టాట్ చేశారు. అదే `ఇస్మార్ట్ జోడి`.

 

అయితే వాస్త‌వానికి ఓంకార్ ఈసారి మాంచి డాన్స్ షోతో ముందుకు రావాలని భావించాడు. కానీ, స్టార్ మా అభ్యర్థనతో ‘ఇస్మార్ట్ జోడీ’ కి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం 12 సెలబ్రెటీ జోడీలు, 18 వారాల పాటు పాల్గొన్న ఈ గేమ్ షో బిగ్గెస్ట్ ఫైట్‌లో టైటిల్ ఏ జోడీ గెలుచుకుంటుందో ఆ జోడి ఇస్మార్ట్ జోడీగా నిలుస్తుంది. శని మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇక ఈ రియాలిటీ షోలో 12 సెలబ్రిటీ జంటలు తమ ప్రేమ యొక్క గొప్పదనాన్ని.. తమ బంధాన్ని అనుబంధాన్ని ప్రేక్షకులకు తెలియజేయనున్నారు.

 

ఇక ఈ సరికొత్త షో మొదటి ఎపిసోడ్ కే దాదాపు 10 టీఆర్పీను దాటేసింది. మొదటి ఎపిసోడ్ కాబట్టి అంత రేటింగ్ వచ్చింది అనుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి రాబోయే ఎపిసోడ్స్ ను ఎలా ప్లాన్ చేసారు అన్నది ముఖ్యం. అందుకు తగ్గటుగానే మంచి ఎంటర్టైన్మెంట్ తోనే ఓంకార్ తన కంటెస్టెంట్స్ తో రకరకాల టాస్కులతో అదరగొడుతున్నారు. ఇక ముందు కూడా అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని తెలుస్తోంది. దీంతో ముందు ముందు కూడా మంచి టీఆర్పీ రేటింగ్స్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఓవ‌ర్ఆల్‌గా చూస్తుంటే ఓంకార్ ప్లాన్లు, ఐడియాలో ఈ షోలో బాగానే వ‌ర్కౌట్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: