జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  జబర్దస్త్ కామెడీ షో అంటేనే చాలా మందికి లైఫ్ ఇచ్చింది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి ఎంతోమంది నటులు ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నారంటే దానికి కారణం కూడా ఈ షోనే అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. మ‌రియు ఇప్పటికీ చాలా మంది కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు. దాదాపు ఏడేళ్లుగా నిర్విరామంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ కామెడీ షో గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అనిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే జబర్దస్త్ షో గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని ప్రేక్షకులుండరు.

 

ఇక ఇటీవ‌ల జబర్దస్త్ షో నుంచి నాగబాబు బయటకు రావడమే ఓ పెద్ద సెన్సేషన్‌గా మారింది. వస్తూ వస్తూ షో మీదా, నిర్వాహకుల మీదా విమర్శలు చేశాడు. అయిన‌ప్ప‌టికీ ఈ షో టీఆర్పీ రేటింగ్స్ మాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌రింత జోష్‌తో ముందుకు సాగుతోంది. ఇక ఈ వారం ప్ర‌సారం కాబోయే జబర్దస్త్ షో ప్రోమోను చూస్తే అదిరిపోయేలా ఉంద‌ని స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ప్రోమోను బ‌ట్టీ చూసుకుంటే.. ఈ వారం “వీ” చిత్రానికి సంబందించిన హీరో సుధీర్ బాబు, దర్శకుడు ప్రత్యేక అతిధులుగా వచ్చారు. వఛ్చి రాగానే యాంకర్ రష్మీ పై, హీరో సుదీర్ బాబు వేసిన పంచ్ హిలేరియస్‌గా న‌వ్విస్తాయి.

 

అలాగే  ఎప్పటిలాగే సుడిగాలి సుధీర్ సరికొత్త కామెడీతో అందరిని పొట్ట చెక్కలయ్యేలా చేశారు. ఇక మ‌రోవైపు బులెట్ భాస్కర్ ల స్కిట్ లో విదేశి పెళ్ళిలో, పల్లెటూరి ఆర్కెస్ట్రా వారి హంగామా క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. ఇక ఎప్పటిలాగే పిల్లలతో రాకేష్ ఇరగదీసాడు. ముఖ్యంగా రాకేష్ భామ గెట‌ప్ అదిరిపోయింద‌ని చెప్పాలి. అలాగే  మాస్ అవినాష్, కార్తీక్ ల స్కిట్ లో ఇమ్మానుయేల్ చేసే కామెడీ చూస్తే.. న‌వ్వు అప్పుకోలేదు. ఏదేమైనా ఆ సారి ఎక్స్ట్రా జబర్దస్త్ అదిరిపోయేలా క‌నిపిస్తుంది. కాబ‌ట్టి.. ఈ వారం అస్స‌లు మిస్ కాకుండా ఎక్స్ట్రా జబర్దస్త్ చూసి ఆనందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: