జబర్దస్త్.. బుల్లితెరపై ఎన్నో సంచలనాలు నమోదు చేసిన ఈ షో గురించి, అందులోని ఆర్టిస్ట్‌ల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జబర్దస్త్ షో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. అంతేకాదు, ఎంతోమంది కమెడియన్లను సైతం తెలుగు చిత్ర పరిశ్రమకు అందించింది. ఏడేళ్లు గడుస్తున్నా షో రేటింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు.  ఇంత క్రేజ్ తీసుకావడానికి తమ వంతు పాత్ర పోషించిన షో న్యాయ నిర్ణేతలు నాగబాబు, రోజా. జబర్దస్త్ కమెడియన్స్ వేస్తున్న పంచ్ డైలాగ్స్ ఒకెత్తయితే.. ఈ ఇద్దరి నవ్వులు మరో ఎత్తు. అయితే ఇటీవ‌ల న‌వ్వుల న‌వాబుగా పేరు తెచ్చుకున్న నాగ‌బాబు షో నుండీ త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

 

కారణాలేమైనప్పటికీ ఆయన ఇలా హఠాత్తుగా తప్పుకోవడం బుల్లితెర ఆడియన్స్‌కి షాకిచ్చింది. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన నాగ‌బాబు.. ఆయన తోపాటు కొంతమంది జబర్థస్గ్ కామెడీయన్లు వేరు కుంపటిని జీ తెలుగు చానల్లో అదిరింది పేరుతో పెట్టుకున్నారు. ఇక రెమ్యునరేషన్ కారణంగానే ఆయన బయటికి వెళ్లిపోయినట్టు తెగ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు కొత్త కోణాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నాగ‌బాబు జబర్దస్త్ నుంచి త‌ప్పుకోవ‌డానికి రోజానే కార‌ణ‌మా..? అంటే అవున‌నే అంటున్నారు నాగబాబు సన్నిహిత వర్గాలు.

 

వాస్త‌వానికి జబర్ధస్త్ ప్రోగ్రామ్ ప్రారంభం అయినప్పటి నుంచి వీళ్లిద్దరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ వచ్చారు. వీరి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.. రోజా రెండోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె గెలిచి పార్టీ అధికారంలోకవి రావడంతో ఆమెపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిగిపోయింది. మరోవైపు నాగబాబు కూడా తమ్ముడు జనసేన పార్టీ తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అస‌ల వేడి స్టాట్ అయింద‌ట‌.

 

 ముందు నుంచి రోజా రాజకీయాల్లో ఉన్న నాగబాబుతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ ఎపుడైతే నాగబాబు.. జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ వ్యతిరేకంగా పనిచేసారో అప్పటి నుంచి రోజా పై రాజకీయంగా కొన్ని ఒత్తిడిలు పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో రోజానే జబర్దస్త్ నిర్వాహ‌కుల‌తో నాగ‌బాబు వెళ్లిపోయాలా సంప్ర‌దింపులు చేశార‌ని అంటున్నారు. దీంతో నాగ‌బాబు త‌న దారి తాను చూసుకున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంతో తెలియ‌దుగాని.. చాలా మంది ఇదే నిజం అని న‌మ్ముతున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: