ఉగాది అంటే తెలుగింటి తొలి పండుగ. ఈ పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఉగాది పండ‌గ ఈ నెల 25 వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రి స్టార్ మాలో ఉగాదికి మూడు రోజుల ముందే పండ‌గ రావ‌డం ఏంటి..? అన్న‌దేగా మీ ప్ర‌శ్న‌. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. పండుగలు వస్తున్నాయి అంటే ఇళ్లల్లో సందడితో పాటుగా ఇళ్లల్లో ఉండే వారికి తెలుగు బుల్లితెర ఛానెల్స్ అందించే సందడి వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి.

 

ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌టికే ప‌లు ఛానెల్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నారు. అందులో స్టార్ మా ఛానెల్ కూడా ఒక‌టి. అయితే స్టార్ మా వారు తమ సరికొత్త సినిమాతో ఉగాది పండుగ వాతావరణాన్ని ఒక మూడు రోజుల ముందే తీసుకొచ్చేస్తున్నారు. ఏ సినిమా అనేగా.. మెగా మేన‌ల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇటీవ‌ల విడుద‌లై.. మంచి హిట్ అందుకుంది `ప్రతిరోజూ పండగే`. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటించింది. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

గ‌త ఏడాది క్రిస్మస్ కానుక‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షో నుంచే మంచి టాక్ ల‌భించ‌డంతో.. బాక్సాఫిస్ వ‌ల్ల కాసుల వ‌ర్షం కురిపించింది. కన్నతండ్రి ప్రాణాలకంటే ఉద్యోగాలే ఎక్కువనుకునే కొడుకులు ఒక వైపు .. చివరి క్షణాల్లో కొడుకులతో కలిసి ఉండటమే పండగ అనుకునే తండ్రి ఒక వైపు. ఆ కొడుకుల ఆలోచనా విధానాన్ని మార్చి .. ఆ తండ్రి ముచ్చట తీర్చే ఒక మనవడి కథే ఇది. కామెడీ బాగా పండడం,ఎమోషనల్ సీన్స్ బాగా ఎలివేట్ అవ్వడం, కథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సినిమాకి ప్లస్ లు గా మారాయి. ఇక ఈ సినిమాను వరల్డ్ తెలివిజన్ ప్రీమియర్ గా  మార్చ్ 22 ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయబోతున్నారు స్టార్ మావారు. ఇలా సూప‌ర్ హిట్ చిత్రంతో స్టార్ మా ముందుగానే పండ‌గ తేనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: