ప్ర‌స్తుతం కరోనా వైరస్ బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ వైరస్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం ఇటలీలో ఎక్కువగా కనిపిస్తుంది.  శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 627 మంది మహమ్మారికి బలైపోయారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 4వేల 32కు చేరింది. ఇక ఇటలీ తర్వాత స్పెయిన్, జర్మనీ, అమెరికా, ఇరాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, బ్రిటన్‌లో కూడా కరోనా కేసులు, మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.  ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల‌కు పాకిన‌ కరోనా వైరస్.. 11,417 మందిని బ‌లి తీసుకుంది. 

 

అయితే ఈ క‌రోనా వైర‌స్ మ‌నుషుల‌పైనే కాకుండా.. అన్ని రంగాల‌పై చూపింది. ప్రతీ చిన్న విషయం కూడా ఇప్పుడు కరోనా మూలంగా కదిలింది.ఇప్పుడు దీని ప్రభావం తెలుగు ప్రేక్షకులకు కూడా గట్టిగానే తగిలింది. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లంద‌రూ క‌రోనా కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయ్యాడు. దీంతో వీరికి  ఏకైక ఎంటర్టైన్మెంట్ టీవీ ద్వారానే పొందాలి. అందులోనూ ముఖ్యంగా సీరియ‌ల్స్‌కు విప‌రీతంగా క్రేజ్ ఉంది.  ఆడ మెగా అని తేడా లేకుండా అందరూ సీరియల్స్ చూసేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఎన్నో సీరియ‌ల్స్ ఉన్నాయి. అయితే వీటికి కూడా క‌రోనా ముప్పు త‌ప్ప‌లేదు.

 

కరోనా వైరస్ ప్రభావం కారణంగా మన తెలుగు అన్ని ఛానల్స్ వారు కూడా తమ షూటింగ్స్ ను నిలిపివేసినట్టు తెలుస్తుంది. అది కూడా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం ఈ మార్చ్ 31 వరకు నిలిపివేసినట్టు తెలుస్తుంది. మరి ఇలా అయితే ప్రతి రోజు టెలికాస్ట్ అయ్యే సీరియల్స్‌ సంగతి ఏంటి అంటే దానికి కూడా సమాధానం ఉంది. ఇంత‌కు ముందు టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్స్ నే మళ్ళీ టెలికాస్ట్ చేసి ఆ స్లాట్ లో టెలికాస్ట్ చేయనున్నట్టు సమాచారం. ఏదేమైనా పాత ఎపిసోడ్స్ చూడండాలంటే ప్రేక్ష‌కులు క‌ష్టంగానే ఉంటుంది మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: