వంటలక్క తెలియని వారు ఉండరు.. సాయింత్రం అవుతూనే ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలు వెలుగుతాయో లేదు తెలీదు కానీ బుల్లితెరలో మాత్రం కార్తీక దీపాలు వెలుగుతాయి. కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ కార్తీకదీపంపై కూడా పడింది. అందుకే ఈ దీపాలను తాత్కాలికంగా టీవిలో నిలిపివేశారు. అయితే ఈ సీరియల్ అభిమానులకు ఓ శుభవార్త అందింది. 

 

అది ఏంటి అంటే? కార్తీక దీపం సీరియల్ ను రీ టెలికాస్ట్ చేస్తున్నారట.. అంటే ఈ సీరియల్ మొదలైనప్పటి నుండి మళ్లీ ఈ సీరియల్ ను రీ టెలికాస్ట్ చేస్తారు అని అర్ధం. అయితే ఇప్పటికే వంటలక్కకు భారీగా అభిమానులు ఉన్నారు.. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరుకు చాలామంది ఈ వంటలక్కకు అభిమానులు ఉన్నారు. 

 

డాక్టర్ బాబు ఈ వంటలక్కను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు.. ఎప్పుడు న్యాయం చేస్తాడు అని ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ సీరియల్ కు బ్రేక్ పడటంతో అభిమానులు కాస్త డాల్ అయినప్పటికీ ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సీరియల్ ను రీ టెలికాస్ట్ చేసి మంచి టైం పాస్ అయ్యేలా చేస్తున్నారు. 

 

ఇకపోతే సీరియల్స్ అన్ని ఎప్పుడు మళ్లీ మొదలవుతాయి అనేది ఇప్పుడే చెప్పలేము.. ఎందుకంటే ఈ సీరియల్స్ షూటింగ్స్ అన్ని కూడా కరోనా వైరస్ కారణంగా ఆగిపోయాయి. దీంతో రెండు మూడు రోజులకు పెట్టుకున్న సీరియల్స్ అన్ని కూడా అయిపోయాయి.. దీంతో లాక్ డౌన్ అయినా మూడు నాలుగు రోజులకు కానీ ఈ సీరియల్స్ బుల్లితెరపై వస్తాయ్ అనే నమ్మకం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: