అనుకుంటాం కానీ అండి.. అప్పట్లో వచ్చిన చూపులు కలిసిన శుభవేళ సీరియల్ తో పోలిస్తే ఇప్పుడు వంటలక్క కూడా పనికిరాదు.. అప్పట్లో ఆ సీరియల్ అంత సూపర్ హిట్.. అందులో ఉండే అర్జున్ సింహ రాయుడు.. ఇందు కుమారి దేవి.. ఒకరు క్లాసు.. మరొకరు మాసు.. ఇద్దరి మాటల ఫైట్ చూస్తే నవ్వు ఖాయం.. అలా ఉండేది ఆ సీరియల్. 

 

ఆ సీరియల్ చూడటానికి పిల్లల నుండి పెద్దల వరుకు ప్రతి ఒక్కరు ఇష్టం చూపించే వారు.. ఆ సీరియల్ కోసం 6 : 30 నిముషాలు ఎప్పుడు అవుతుంది అని ఎదురు చూసేవాళ్ళు.. ఎందుకంటే ఆ సీరియల్ పిచ్చి అలా ఉండేది.. అందుకే ఆ సీరియల్ స్టార్ మా'లో అయిపోతే మళ్లీ రాత్రి 9 గంటలకు స్టార్ మా గోల్డ్ లో చూసేవాళ్ళు.. 

 

ఇంకా అలాంటి సీరియల్ ను మళ్లీ మళ్లి చూడటానికి హాట్ స్టార్ లాంటివి అప్పట్లో లేవు.. యు ట్యూబ్ లో అన్ని సగం సగం. అయితే ఇప్పుడు ఎలాగో సూపర్ హిట్ సీరియల్స్ ని వాళ్ళ ఛానల్ వాళ్ళు రీ టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి.. ఈ సీరియల్ కూడా చేస్తే బాగుండు అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఈ కోరికను స్టార్ మా వాళ్ళు పట్టించుకుంటే బాగుండు. ఎందుకంటే ఆ సీరియల్ సుత్తి లేని సీరియల్ కాబట్టి. 

మరింత సమాచారం తెలుసుకోండి: