వంటలక్క.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కార్తీక దీపం అంటూ సీరియల్ లో ముందు నల్ల దీపలా కనిపించి అలరించిన ఈ భామ ఇప్పుడు వంటలక్కలా అలరిస్తూ ప్రేక్షకులకు దగ్గరయింది. రోజు రోజుకు ఈమె క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది అంటే నమ్మండి.. అలాంటి క్రేజి సీరియల్ స్టార్ ఇప్పుడు అభిమానులకు మరో క్రేజీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తా అని చెప్పింది. 

 

ఎప్పుడు ? ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. దేశాన్ని వణికిస్తున్న కరోనా మహంమారిని పారద్రోలే చర్యల్లో భాగంగా.. ''తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించండి..'' అంటూ మోడీ ఇచ్చిన పిలుపుని స్వకరించిన వంటలక్క ఫేస్ బుక్ లైవ్ కు వచ్చి దీపం వెలిగించింది. అనంతరం ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఆమె దీపం వెలిగిస్తున్న మీ ఫొటోస్ ను కామెంట్ బాక్స్ లో షేర్ చెయ్యండి అనింది.. అంతేకాదు మీ ఫోన్ నెంబర్ కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి.. ఆలా చేస్తే నేను మీకు ఫోన్ చేసి మాట్లాడుతాను అనింది.. 

 

ఇంకా అంతే నిమిషాల్లో కామెంట్లు, లైకులు పెరిగిపోయాయి.. ఫ్యాన్స్ అందరూ కూడా ఫేస్ బుక్ లైవ్ లో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి మరి వారి అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో వంటలక్కకు తనకు ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది ఆమెతో పాటు అందరికి అర్థం అయి ఉంటుంది.  ఏది ఏమైనా వంటలక్కకు అభిమానులకు కొరతే లేదు అని చెప్పాలి.. మరి మీరు ఎం అంటారు? 

మరింత సమాచారం తెలుసుకోండి: