అవును.. అలాంటి గొప్ప సీరియల్ వచ్చేనా.. ఇంకో వందేళ్లు పోయిన ఈ సీరియల్ మళ్లీ మళ్లీ చూస్తారు.. ఎప్పటికి ఓ అద్భుత సీరియల్ గా ఉండిపోతుంది. ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న. భార్య కలలను భర్త.. భర్త ఎదుగుదల కోసం భార్య పడే తపన ఇందులో కనిపిస్తుంది.. ఒకరికి ఒకరు ఎలా గౌరవం ఇచ్చుకోవాలో ఇందులో ఉంటుంది.. ఒక చదువుకున్న అమ్మాయి అక్షర జ్ఞానంలేని కుటంబాన్ని ఎలా కాపాడుకుందో అనేది ఉంటుంది.. ఆమె తెలివితో ఆమె కుటుంబాన్ని ఆదర్శ కుటుంబంగా ఎలా మార్చింది అనేది ఇందులో ఉంటుంది.. 

 

కానీ ఇలాంటి సీరియల్స్ ఇప్పుడు రావు.. ఒకవేళ వచ్చిన ఆ సీరియల్స్ లో కేవలం 100 ఎపిసోడ్ లకే కథ అయిపోయి కొత్త కథ సృష్టిస్తారు.. ఆ కథలో ఏమైనా సూపర్ డూపర్ ఉంటుందా అంటే అదేంలేదు.. చివరికి భార్యను భర్త అనుమానించడమో.. భర్తను భార్య అనుమానించడమో ఉంటుంది.. భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటే అత్తమామలకు నచ్చదు.. వాళ్ళు ఏదో గొడవ పెట్టాలని ప్రయత్నిస్తారు.. ఇలా అత్త కోడలు, భార్య భర్త అనుమానాలు తప్ప ఏమి కొత్తగా ఉండవు.. ఇంకా అలాంటి సీరియల్స్ చూసి పిచ్చి వారిలా తయారవుతారు ఈ ప్రేక్షకులు.. 

 

ఏదైనా సీరియల్ అంటే ఎపిసోడ్ లపై ఎపిసోడ్ లు కాకుండా.. టీఆర్పీ కోసమే కాకుండా కొంచం సమాజానికి ఉపయోగ పడే సీరియల్స్.. అంటే ఈ తరం ఇల్లాలు లాంటి సీరియల్స్ తీస్తే చూడటానికి ఆసక్తిగాను ఉంటారు. ఈ తరం ఇల్లాలు సీరియల్ తెలుగు వాళ్ళది కాదు.. హిందీ సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్ ను ఎంతమంది చూశారు.. ఇప్పుడు టీవీలలో వేసిన వంటలక్కను మించి టిఆర్పి వస్తుంది. అయినా మనవాళ్ళు ఇలాంటి ఆదర్శవంతమైన సీరియల్ తియ్యరు లెండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: