ఎప్పుడైనా ఏ షో అయినా సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా కాన్సెప్ట్ వల్లే అని అంటుంటారు కొందరు.. అయితే కాన్సెప్ట్ ఎంత ప్రత్యేకంగా ఉన్న అది ప్రేక్షకులకు అర్థం అయ్యే రీతిలో చెప్పగలిగేది యాంకరే. అయితే కాన్సెప్ట్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ షోస్ ని నిలబెట్టిన యాంకర్స్ ఎంతోమంది ఉన్నారు. అయితే షో బాగాలేకపోయినప్పటికీ కేవలం అంటే కేవలం ఆ యాంకర్స్ ని చూడటానికి షో పెట్టేవాళ్ళం. అలాంటి యాంకర్స్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు.. అప్పట్లో స్టార్ యాంకర్స్ గా ఉన్న వారు ఇప్పుడు ఎక్కడ కనిపించకుండా పోయారు.. ఆ హీరోయిన్స్ ఎవరు అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

జాహ్నవి.. 

 

ఈమె పేరు గుర్తు ఉండదు కానీ ముఖం చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపడతారు.. జెమినీ టీవీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ద్వారా పరిచయం అయినా జాహ్నవి.. తర్వాత ఎన్నో షోస్ ని యాంకరింగ్ చేసింది.. యజ్ఞం, రణం, హ్యాపీ వంటి చిత్రాల్లో నటించి అందరిని మెప్పించింది. అలాంటి ఈ క్యూట్ యాంకర్ ఇప్పుడు కనుమరుగైపోయింది. 

 

కీర్తి... 

 

యూర్స్ లవింగ్లీ, నీ కోసం ప్రోగ్రామ్స్ తో కీర్తి చాలా ఫేమస్ అయ్యింది. తర్వాత జెమినీ టీవీ, తేజ టీవిలో చాల ప్రోగ్రామ్స్ ని హోస్ట్ చేశారు.. ఇంకా ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించడం లేదు. 

 

లిఖిత కామిని.. 

 

జెమినీ టీవీతో పరిచయమైనా టాలెంటెడ్ యాంకర్ లిఖిత కామిని. ఎన్నో షోస్ లో యాంకర్ గా చేసిన లిఖిత ఆ తర్వాత మొగలి రేకులు వంటి సీరియల్స్ నటించింది.. ఇంకా ఆతర్వాత ఆమె ఎక్కడ కనిపించలేదు. 

 

చిత్రలేఖ.. 

 

ఈటీవీలో సినీరంజిని సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చిన చిత్రలేఖ తర్వాత మా ఊరి వంట ప్రోగ్రాం చేసి బాగా పాపులర్ అయ్యింది..ఆతర్వాత దూరదర్శన్ లో తెలుగింటి అమ్మాయి అని ఒక ప్రోగ్రాం చేసిన ఆమె ఆతర్వాత ఎక్కడ కనిపించలేదు. 

 

రజిని.. 

 

జెమినీ మ్యూజిక్ తో పరిచయమైనా ఈ రాజీకి తర్వాత కొన్ని సినిమాల్లో సీరియల్స్ లో కూడా నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించడం లేదు.. 

 

అప్పట్లో ఓ వెలుగు వెలిగిన యాంకర్స్ అందరూ కూడా ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు.. ఎన్నో షో చేసినప్పటికీ వారికీ సరైన గుర్తింపు లేకపోవటమే కారణం అని చెప్పచ్చు. ఏమైతేనేం.. మన చిన్నతనంలో ఈ యాంకర్స్ బుల్లితెరపై ఓ రేంజ్ లో స్టెప్స్ వేసి అలరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: