అబ్బో.. అప్పట్లో వచ్చిన దయ్యలా సీరియల్స్ కి మించి ఉన్నాయా ఇప్పుడు సినిమాలు.. నిజం చెప్పాలి అంటే ఆ సీరియల్స్ భయపెట్టినట్టు ప్రస్తుతం ఏ దయ్యం సినిమా భయపెట్టలేవు.. అలా ఉండేవి ఆ సీరియల్స్.. ఇప్పుడు అలాంటి సీరియల్స్ ఏవి రావు.. వచ్చిన అంత భయపెట్టావు.. అందులో కథ ఉండదు.. ఇంకా ఇంట్రెస్ట్ ఎం వస్తుంది? 

 

ఇంకా అప్పట్లో మనల్ని బాగా భయపెట్టిన సీరియల్స్ ఏవి అంటే? నాగమ్మ.. అన్వేషిత.  అప్పట్లో ఈ సీరియల్స్ పిల్లలను, పెద్దలను ఓ రేంజ్ లో బయపెట్టాయి. సీరియల్స్ చూస్తే చాలు భయపడి చచ్చేవాళ్ళు.. అలా ఉండేవి ఆ సీరియల్స్. అంత భయపెట్టిన సరే. మళ్లీ మళ్లీ చూడాలి అని అనిపించేవి. 

 

అందుకే ఈ సీరియల్స్ కు ఇప్పటికి మంచి డిమాండ్ ఉంది.. ఈ సీరియల్స్ కోసం ఇప్పటికి గూగుల్ లో వెతికి వెతికి పెడుతున్నారట ప్రజలు. అంటే చుడండి.. ఈ సీరియల్స్ కి ఎంత డిమాండ్ ఉందో. ఇంకా అన్వేషిత సీరియల్ ఉన్నంత భయంగా మారే సీరియల్ లేదు అంటే నమ్మండి.. అయినా ఇప్పట్లో భార్యను మోసం చేసిన భర్త.. భర్తను మోసం చేసిన భార్య.. ఇవి రెండు కాదు అంటే అనుమానం.. కుల పిచ్చి.. ఈ రకమైన సీరియల్స్ తప్ప మరో కొత్త రకమైన సీరియల్స్ వస్తాయా అసలు?

మరింత సమాచారం తెలుసుకోండి: