అవును.. అప్పట్లో జెమినీ టీవీలో ఓ సీరియల్ వచ్చేది.. ఆ సీరియల్ లో హీరోయిన్ ఏడుపు చూస్తే మన అమ్మమ్మ, అమ్మ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళొచ్చేవి.. అంత ఘోరంగా ఉండేది ఆ సీరియల్. ఎందుకు ? అందులో ఎవరైనా చనిపోతారా? లేక ఎవరైనా చంపుతారా? అని మీరు అనుకోవచ్చు.. అక్కడ ఎం లేదు.. 

 

భర్త భార్యను అనుమానిస్తాడు.. పెళ్ళైన మరుసటి రోజే భార్యను టర్చర్ పెట్టడం మొదలు పెడుతాడు ఆ స్రవంతి సీరియల్ లో భర్త. ఇంకా అంతే.. ఆ సీరియల్ చుసిన ప్రతి ఒక్కరూ.. అయ్యో స్రవంతి అని అనుకుంటారు. ఇప్పుడు ఎలా అయితే అయ్యో వంటలక్క అని అనుకుంటున్నారో... అప్పుడు అయ్యో స్రవంతి అని అనేవాళ్ళు. 

 

ఇంకా అప్పట్లో ఓ రేంజ్ లో ఏడిపించిన స్రవంతి సీరియల్.. ఇప్పుడు వంటలక్క రూపంలో స్టార్ మా లో కార్తీక దీపం అంటూ మన ముందుకు వచ్చింది. ఇంకా వచ్చింది ఆలస్యం.. నల్ల దీపకి క్రేజ్ పెరిగిపోయింది.. డాక్టర్ బాబు సీరియల్ లో వంటలక్కను తిడితే సోషల్ మీడియా వేదిక చేసుకొని ఆ డాక్టర్ బాబును తిడుతున్నారు. అలా ఉంది మరి వంటలక్క క్రేజ్. ఏది ఏమైనప్పటికి.. సీరియల్ అంటే ఒకే స్టోరీ.. అమ్మాయిని ప్రేమించడం... పెళ్లి చేసుకోవడం.. అనుమానం పేరుతో ఆ అమ్మాయిని వెళ్లగొట్టడం.. ఇదే స్టోరీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: