మనం ఇప్పుడు సీరియల్స్ చూస్తున్నాం.. అప్పుడు చూసే వాళ్ళం కానీ ఒకటే తేడా. అప్పుడు కథ అద్భుతంగా ఉండేది ఇప్పుడు మేకప్ ఉంటుంది అంతే. ఎలాంటి కథ లేకపోయినా సీరియల్ నడిపించేస్తారు.. టీఆర్పీల కోసం చచ్చిన వ్యక్తులని తిరిగి రమ్మంటారు. ఇంకా అలాంటి సీరియల్స్ ఉన్నాయి ఈ కాలంలో. 

 

నిజం చెప్పాలి అంటే.. సీరియల్ అంటేనే ఒక సోది. అలాంటి సోది ఏలాగోలా కష్టపడి ప్రేక్షకులు భరిస్తూ వస్తారు.. ఎంత చెత్త సీరియల్ అయినా తియ్యు మొదట వారం రోజులు పాటు బాగుంటే దానికి అభిమానులు అవుతారు.. ఇంకా అప్పట్లో విధి, ఋతురాగాలు, అంతరంగాలు, పిన్ని, మెట్టెల సవ్వడి వంటి సీరియల్స్ సూపర్ హిట్. 

 

ఆ సీరియల్స్ ఇప్పుడు మళ్లీ వేసిన కాదు అనకుండా చూసే అభిమానులు ఉన్నారు. మన అమ్మ, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు అయితే ఇప్పటికి ఈ సీరియల్స్ గురించి చెప్తారు.. ఎంత బాగుంటాయో ఆ సీరియల్స్ అంటూ ఓ గొప్పలు చెప్తారు ఆ సీరియల్స్ గురించి.. ఇంకా మనం మన పిల్లలకు ప్రస్తుత సీరియల్స్ గురించి ఎం చెప్పగలం.. వాళ్ళు మేకప్ ఆర్టిస్టులు యాక్టర్లు కాదు అనే చెప్పాలి.. ఎందుకంటే సీరియల్ అంత కూడా మేకప్ తప్ప ఏమి ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: