మనం అనుకుంటాం కానీ అప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ లో వచ్చెనంత కంటెంట్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది అండి. సీరియల్స్ కానీ, సినిమాలు కానీ ఏవి అయినా సరే సూపర్ హిట్టే. పిల్లలు కానీ, పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కి అతుక్కుపోయేవారు. ఎందుకంటే అప్పట్లో అలా ఉండేది ఆ కంటెంట్.. కానీ ఇప్పుడు టీవీ ఆన్ చెయ్యాలి అంటే తూ అనిపిస్తుంది. ఒక ఛానల్ లో ఒక ప్రోగ్రామ్ వస్తే మిగితా ఛానెల్స్ లో కూడా సేమ్ ప్రోగ్రామ్స్. అదేంటో అర్థం కాదు!

 

అసలు మంచి కంటెంట్ ఉన్న ప్రోగ్రామ్స్ ఎం ఉన్నాయ్ అండి.. ప్రోగ్రామ్స్ కాదు సీరియల్స్ అయినా ఉండాలి కదా! ఇంకా ఇప్పుడు జెమినీ టీవీ అయితే మరి దారుణం.. అప్పట్లో జెమినీ టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్, సీరియల్స్ అన్ని సూపర్ హిట్టే. కానీ ఇప్పుడు అసలు ఏవి సూపర్ హిట్ కాదు కదా! హిట్ కూడా అవ్వడం లేదు.. ఆఖరికి సీరియల్స్ కూడా.. ఏదో చెయ్యాలి అని అనుకుంటారు కానీ అది పెద్ద హిట్ కాదు.. అయినా కంటెంట్ దొరకకపోతే ఆ మేనేజమెంట్ అయినా ఎం చేస్తుందిలే. 

 

సరే.. కొత్త కాంటెంట్ లేదు.. కనీసం పాత కంటెంట్ అయినా ఉపయోగించాలి కదా! అప్పట్లో ఈ సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు వేసిన చూస్తారు.. అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. డాన్స్ బేబీ డాన్స్, సాహసం చెయ్యరా డింభకా, జాణవులే.. నేర జాణవులే, టాక్ అఫ్ ది టౌన్, పట్టుకుంటే పట్టు చీర, వన్స్ మరి ప్లీస్, అట కావాలా పాట కావాలా, కొత్త సినిమా గురు, నిజం బాబులు, అమృతం సీరియల్.. అబ్బూ ఈ షోస్ అన్ని కూడా అప్పట్లో సూపర్ హిట్టు.. కానీ ఇప్పుడే అలాంటి కంటెంట్ ఉన్న షోస్ జెమినీ టీవీలో కనిపించక.. రేటింగ్స్ లో దారుణంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: