సాయింత్రం ఆరు అయ్యింది అంటే చాలు.. ఈ సీరియల్ వచ్చేది.. అనకూడదు కానీ.. 10 సంవత్సరాల్లో 10 తారలు మారాయి ఈ సీరియల్ లో.. సీరియల్ ప్రేమ ఆప్యాయత కంటే కూడా రాజకీయాలు ఎక్కువ.. ఎలాగైనా సరే పెద్ద కోడలిని తరిమేయాలి.. ఆస్థి అంతా నా పేరు మీదకు వచ్చేయాలి అనే స్వార్ధం.. 

 

ఇంకా ఇందులో ఉండే గోపిక మంచి పిచ్చిది అయితే.. రాశి.. ఎక్కువ రోజులు బ్రతుకుతున్నట్టు.. ఆస్తి అంత ఆమెకే కావాలి అన్నట్టు అతి చేసే మహిళ రాశి. ఎప్పుడు చూడు గోపికను వాళ్ళ అత్త తిట్టాలి అని రాశి తెగ రాజకీయాలు చేస్తుంటుంది.. అందుకోసం రాశి తల్లి.. ఆమె ఎన్ని ప్లాన్స్ వేస్తారో.. 

 

నిజం చెప్పాలి అంటే ఈ సీరియల్ లో గోపిక అత్తా అన్నింటిలో కరెక్ట్ ఉండాలి అని కోరుకుంటుంది.. అందుకే.. అందంతో పాటు అణుకువ కూడా ఉన్న అమ్మాయిని ఏరి కోరి మరి కొడుకుకు గోపికను ఇచ్చి పెళ్లి చేస్తారు.. కానీ గోపికకు చదువు లేదు.. అందుకే స్కూల్ కి పంపిస్తారు... చదువుకోడానికి.. ఇలా ఎన్నో రకాలుగా కోడలికి సహాయం.. తప్పు చేసినప్పుడు తిడుతూ.. తల్లిలా ప్రవర్తించేది అత్త. 

 

ఇది అంత చూసి ఓర్వలేని రాశి.. భర్తను వదిలేసి.. గోపిక కాపురం పాడు చెయ్యాలి అని ఉండేది.. అయితే చివరికి రాశి కూడా మారింది అనుకోండి.. ఇంకా ఈ సీరియల్ కూడా డబ్బింగ్ సీరియల్ ఏ.. కాన్సెప్ట్ పాతది అయినా ఈ సీరియల్ కి ఫాన్స్ ఎక్కువ.. నిజం చెప్పాలి అంటే చివరికి సొల్లు అయ్యి.. ఈ సీరియల్ ని ఆపేయండి రా బాబు అనేలా సీరియల్ తీశారు.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: