హైప‌ర్ ఆది.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. ఆ జాబితాలో ముందు వరుసలో కనిపించే పేరు హైపర్ ఆది. జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది స్కిట్లకు .. ఆయన పంచ్ లకు చాలామందే అభిమానులు వున్నారు.  ముందు అదిరే అభి టీంలో ఒకడిగా ఉన్న ఆది.. ఆ తర్వాత సొంతంగా టీం పెట్టుకుని దాన్ని తనదైన శైలిలో నడిపిస్తూ తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ షో ద్వారా టాప్ రేంజ్‌లో పాపుల‌ర్ అయిన ఆది సినిమాల్లోనూ సైడ్ క్యారెక్ట‌ర్స్‌తో స‌త్తా చాటుతున్నాడు.

IHG

ఇక తన పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు చెక్కలు చేయడం ఆదికి అలవాటే. అయితే ఈయ‌న స్కిట్స్ కేవ‌లం టీవీలోనే కాదు యూట్యూబ్‌లో సైతం దుమ్ము దులిపేస్తుంటాయి. తాజాగా కూడా అదే జ‌రిగింది. సాధార‌ణంగా ప్రతి తెలుగు పండుగకు ప్లాన్ చేసే ఈవెంట్స్ కూడా మన స్టార్ హీరోల సినిమాలు వచ్చేంత టీఆర్పీ రేటింగ్ ను కొల్లగొడతాయి. అలా ప్లాన్ చేసిన ఈవెంట్ లో హైప‌ర్ ఆది చేసిన స్కిట్ ఇప్పుడు ఓ కొత్త రికార్డు సృష్టించింది. 2017 సంక్రాంతి నాడు ప్లాన్ చేసిన “సంక్రాంతి పందెం కోళ్లు” అనే ఈవెంట్ లో ప్రసారం అయిన ఆది స్కిట్ ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

 

అయితే ఇప్పటి వరకు 60మిలియన్ వ్యూస్ దక్కించుకొని రికార్డు నెలకొల్పింది. శేఖర్ మాస్టర్, రోజా జడ్జెస్ గా ఉన్న ఈ స్కిట్ లో ఆది తన టీమ్ మెంబర్స్ తో పాటు, సుడిగాలి సుధీర్ తో కలిసి చేశారు. మ‌రియు 60 మిలియన్ వ్యూస్ మార్క్ ను టచ్ చేసి అత్యధిక వ్యూస్ సాధించిన స్కిట్ గానే కాకుండా ఈటీవీ ఛానెల్లో కూడా టాప్ స్థానంలో నిలిచింది. కేవ‌లం  18 నిమిషాల స్కిట్‌కి ఏకంగా 60 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి. ఏదేమైనా హైప‌ర్ ఆదినా మ‌జాకా అనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: