మన జీవితంలో కొన్ని కొన్ని అనుకోకుండా మన మైండ్ లో ఫిక్స్ అయిపోయింటాయి.. ఆ మ్యూజిక్ వస్తే చాలు ఆ పాట నోటికి వచ్చేస్తుంది.. అంతలా కలిసిపోయి ఉంటాయి.. అలానే మనం టీవీ చూసే సమయంలో మనల్ని డిస్టర్బ్ చెయ్యడానికి వచ్చే టీవీ యాడ్స్ కూడా అంతే.. ఎన్నో టీవీ యాడ్స్ వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ అన్ని అద్భుతమే. అలాంటి అద్భుతమైన టీవీ యాడ్స్ ఎన్నో ఉన్నాయ్.. 

 

హాచ్ టీవీ యాడ్.. ఎయిర్టెల్ టీవీ యాడ్.. సంతూర్ టీవీ యాడ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని యాడ్స్ ఓ.. అందుకే ఆ టీవీ యాడ్స్ అన్ని ఇక్కడ చూసి మళ్లీ మీ చిన్ననాటి కాలంకి వెళ్లిపోండి.. ఎంజాయ్ చెయ్యండి.. 

 

 హచ్.. 

 

 

ఇప్పుడు ఈ నెట్వర్క్ లేదు అనుకోండి.. కానీ అప్పట్లో వచ్చిన ఈ యాడ్ కారణంగా ఓ కుక్క బ్రీడ్ పేరు ఏ మర్చిపోయాం.. అదే అండి పగ్.. ఈ కుక్క కనిపించింది అంటే దాన్ని మనం హచ్ కుక్క.. హచ్ కుక్క అనే అంటాం.. హచ్ సిం గుర్తు లేదు కానీ ఆ కుక్క మాత్రం గుర్తుంది. 

 

ఎయిర్టెల్.. ప్రతి ఫ్రెండు అవసరమే రా!

 

 

నిజంగా ఇది సూపర్ తెలుసా? ప్రతి ఫ్రెండు అవసరమే రా.. అనే ఎయిర్టెల్ ఇంటర్నెట్ సాంగ్ వస్తే అసలు మార్చేవారు కాదు.. సీరియల్ మధ్యలో వచ్చినప్పుడు చేంజ్ చెయ్యడానికి ట్రై చేస్తే హేయ్ ఈ  యాడ్ చూడు.. ఎంత బాగుందో అని తిట్టే వారు... అంత బాగుండేది.. కాలేజ్ లైఫ్ ఇంత బాగుంటుందా అని అనిపించినా సాంగ్ అది. 

 

నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా!

 

 

వాషింగ్ పౌడర్ నిర్మా…


వాషింగ్ పౌడర్ నిర్మా…


పాలలోని తెలుపు…నిర్మాతో వచ్చింది…


రంగులా బట్టలే తళ తళగా మెరిసాయి…


హేమా..రేఖా…జయ ఇంకా సుష్మా


అందరూ మెచ్చినదే నిర్మా.


వాషింగ్ పౌడర్ నిర్మా…


నిర్మా…


అప్పట్లో ఈ నిర్మా పాట ఓ వూపు ఊపేసింది అనుకోండి.. ఇప్పటికి ఎప్పటి.. కూడా ఈ పాట అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే నిజంగానే ఈ పాట ఓ అద్భుతం కాబట్టి. 

 

ప్లాటినం ఇవారా.. బాంధవ్య మార్గంలో 

 

 

ఇది ఒక మంచి మెలోడియస్ సాంగ్.. అప్పటికి ఇప్పటికి. 

 

ట్రిపుల్ ఎక్స్ సోప్.. 

 

 

అవును.. నాకు తెలియక అడుగుతాను.. వాషింగ్ సోప్ కి.. సంస్కారానికి లింక్ ఏంటి? అసలు ! ఏంటో.. అయినా సాంగ్ బాగుండేదిలే. 

 

ఎయిర్టెల్.. నాదనేది నీదేనోయ్.. 

 

 

ఇది మరో ఎయిర్టెల్ యాడ్.. మరొక చక్కటి ఫ్రెండ్ షిప్, ఎయిర్టెల్ ద్వారా.. బాగుంటుంది నిజంగానే. 

 

ఖజానా.. విధ విధంగా 

 

 

ఆ బంగారు ఆభరణాలకు తగ్గట్టుగా పాట కూడా అద్భుతంగా ఉంటుంది మరి.. ఇందులో హీరోయిన్స్ మారుతూ వచ్చారు కానీ పాట మాత్రం సేమ్ టూ సేమ్. 

 

ఐడియా సెల్యూలర్.. యువర్ మై పుంప్కిన్ పుంప్కిన్!

 

 

అబ్బో ఈ సాంగ్ ఒకప్పటి అద్భుత యాడ్.. అందరి సెల్స్ కి ఇదే రింగ్టోన్ మళ్లీ.. ఫీలింగ్ సంథింగ్ సంథింగ్.. హాని బని. 

 

క్లోజప్ యాడ్.. 

 

 

ఈ యాడ్ కి మహేష్ బాబు వచ్చాడు కానీ.. పాట ఎప్పటికి అదే.. దగ్గరగా రా.. దగ్గరగా రా.. అని 

 

డైరీ మిల్క్ యాడ్.. కిస్ మీ!

 

 

ఎంత బాగుంటుందో.. నిజంగా.. వాళ్ళు తినేది చూస్తే అనిపిస్తుంది.. అబ్బా ఇంత బాగుంటుందా అని.. కానీ నిజంగానే బాగుంటుంది!

 

లిమ్కా.. 

 

 

ఇప్పుడు తాగితే అదోలా ఉంటుంది కానీ.. యాడ్ మాత్రం మంచి మెలొడితో.. క్రియేటివ్ గా చేసారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: