సన్ నెట్వర్క్.. తెలియనిది కాదు.. మనం చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాం.. అవును.. భారత దేశానికి చెందిన సన్ నెట్వర్క్ గ్రూప్‌ ఆసియాలో అతిపెద్ద టీవీ నెట్‌వర్క్‌లో ఒకటి. 14 ఏప్రిల్ 1993 న కళానిధిమారన్ చేత స్థాపించబడిన ఈ సన్ నెట్వర్క్స్ ప్రైవేటు యాజమాన్యంలోని మొదటి తమిళ ఛానెల్.

 

IHG

 

సన్ గ్రూప్ 2012 నుండి హైదరాబాద్‌కు చెందిన ఐపిఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కలిగి ఉంది. సన్ గ్రూప్ ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ మరియు మరాఠీలలో 32 టీవీ ఛానెళ్లను నిర్వహిస్తోంది. అంతేకాదు సన్ గ్రూప్ కు మొత్తం 42 ఛానెళ్లు ఉన్నాయ్.

 

IHG

 

ప్రస్తుతం రేసులో వెనుకబడినప్పటికీ ఈ సన్ నెట్వర్క్స్ ఉద్యోగుల సంక్షేమం విషయంలో అగ్ర స్థానంలో ఉంది. ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్సై ఇలా అన్ని రకాల ప్రయోజనాలను సన్ నెట్వర్క్ కల్పిస్తోంది. ఉద్యోగులకు బెనిఫిట్స్ విషయంలో ఇతర ఛానెల్ తో పోలిస్తే సన్ నెట్వర్క్ ముందుంటుంది. మినిమమ్ వేజెస్ కానీ.. ఇన్ టైం పేమెంట్ కానీ ఇతర విషాయాల్లో కానీ అన్నిటిలో పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది అంత ఎందుకు అంటే?

 

IHG

 

ప్రస్తుతం కరోనా దెబ్బతో పెద్ద పెద్ద సంస్దలు అన్ని కూడా వారి ఉద్యోగులను తీసేస్తున్న ఈ సమయంలో సన్ నెట్వర్క్స్ తమ సిబ్బందిని కాపాడుకుంటుంది.. డాక్టర్లు వాడే కిట్ ని సన్ నెట్వర్క్స్ తమ జర్నలిస్టులకు ఇచ్చి బయటకు పంపిస్తోంది. వారి ఉద్యోగులకు పీపీఈ కిట్స్ అందజేస్తోంది. ఈ కిట్స్ ధరించి జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారు. మరి ఈ సన్ నెట్వర్క్ ను చూసి నేషనల్ మీడియా కూడా ఇదే డెసిషన్ తీసుకుంటుంది ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: