గంగ.. ఈ సీరియల్ మీకు గుర్తుందా? ఇందులో ఓ పాప ఉంటుంది.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో పాప అంత సైలెంట్ అయితే కాదు.. కాస్త వాయిలెంట్ ఏ. ఎక్కడికి వెళ్లిన అతి చేస్తుంది.. ఎప్పుడు ఇబ్బందుల్లో పడుతుంది.. అంతేకాదు.. ఈ పాపకు కూడా చిన్నప్పుడే పెళ్లి చేసి ఉంటారు.. అయితే ఆ పెళ్ళికొడుకు చనిపోతాడు.. దీంతో ఆ పిల్ల పసుపు కుంకుమ తీసేసి తెల్ల చీర కడుతారు. 

 

అయినా సరే.. పాప అల్లరి తగ్గుతుందా అంటే తగ్గదు.. చిన్నప్పుడే నాన్న వెళ్ళిపోతే.. ఆ అమ్మాయిని ఓ లాయర్ ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటాడు.. ఆ లాయర్ కి ఒక కొడుకు కూడా ఉంటాడు.. అంతేకాదు.. విధవ అయినా అమ్మ కూడా ఉంటుంది.. ఆమె ఈ గంగను పెట్టె కష్టాలు చూస్తే వామ్మో అని అనకుండా ఉండలేరు.. 

 

ఇంకా అలాంటి గంగకి చాలా తెలుసు.. ఈ సీరియల్ లో అంత కూడా ఆరేళ్ళు.. ఏడేళ్లు ఉన్న పిల్లలే.. కానీ ఈ పిల్లలకు అన్ని తెలుసు.. అలా చూపిస్తారు ఈ సీరియల్ లో.. యుద్దాలు జరిగినప్పుడు మోడీ ఎక్కడ ఉన్నాడు.. ఎలియెన్స్ భూమి మీద ఎటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలి.. 2048 సంవత్సరంలో ఎం జరుగుతుంది అనేది అంత వీళ్లకు ముందే తెలుసు.. ఎందుకు? ఎలా తెలుసు అని అనుకుంటున్నారా? 

 

అదేనండీ.. ఈ సీరియల్స్ పిల్లలకు అతి ఎక్కువ.. చాలా తెలివైనవాళ్లు.. గా చూపించడానికి సీరియల్ దర్శకుడు చేసే ఓవర్ యాక్షన్ ఈ పిల్లల తెలివి.. ఇంకా పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు అది ఎలా కవర్ చెయ్యాలో.. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హీరోయిన్స్ కి ఏలాంటి ఐడియాస్ రానప్పుడు ఎం చెయ్యాలి అనేది ఈ సీరియల్ లో పిల్లలు బలే చెప్తారు.. ఇంకా గంగ జీవితం ఎప్పుడు తన కళ్లల్లో గంగ నది ప్రవహిస్తూనే ఉంటుంది.. అందులో ఏలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: