అడ్వేర్టైజ్మెంట్ అంటే ఏలా ఉండాలి చెప్పండి ? అసలు అడ్వేర్టైజ్మెంట్ ఎందుకు వస్తుంది? ఏదైనా కూడా ఒక వస్తువు పాపులారిటీ తెచ్చుకోవాలి అని.. ఆ యాడ్ చూసి ప్రజలంతా వారి వస్తువును కొనాలి అని అడ్వేర్టైజ్మెంట్ ఇస్తారు.. దీంతో ఎంతో క్రియేటివ్ గా ఆలోచించి అడ్వేర్టైజ్మెంట్ చేస్తారు.. 

 

అలా ఎంతో క్రియేటివ్ గా ఆలోచించినప్పటికీ కొన్ని యాడ్స్ చాల అంటే చాలా కామెడీగా ఉంటాయి. అలా కామెడీ అయినా అడ్వేర్తైమెంట్స్ లో హార్పిక్మీ, డిటర్జెంట్ యాడ్స్, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అనే యాడ్స్ బాగా కామెడీ చేశాయ్. అసలు టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంటె ఏంటి ? లేకుంటే ఏంటి? 

 

ఎవడో ఏదో కొరికి ఆ అంటే చాలు.. గోడలు బద్దలు కట్టుకొని మైక్ పట్టుకొని.. మీడియా పట్టుకొని వచ్చేస్తారు.. అసలు ఉప్పుకి పేస్ట్ కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి.. కానీ విల్లు మైక్ పట్టుకొని వచ్చెనంత అయితే ఉండదు.. అందుకే మన టూత్ పేస్ట్ లో ఎం ఎం ఉంటాయో తెలియదు కానీ ఉప్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని ఈ యాడ్ వల్ల తెలిసొచ్చింది. 

 

ఇంకా అంతే.. ఈ యాడ్ పై సోషల్ మీడియాలో ఇప్పటికి జోకులు పేలుతూనే ఉంటాయి.. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు మాత్రమే ఉంటే సరిపోదు.. లవంగాలు.. ఉప్పు, ధనియాలు.. అస్వమేద ఇలాంటివి అన్ని ఉండాలి.. అంటూ కొందరు జోకులు వేస్తే.. మరొకొందరు మాట్లాడుతూ ఎంత కామెడీ యాడ్ అయ్యా ఇది అంటూ నవ్వుకున్నారు.. అంత కామెడీ యాడ్ ఇది.                          

 

మరింత సమాచారం తెలుసుకోండి: