కొత్త సీరియల్స్ వస్తాయ్ అంటే.. ఎందుకండీ కొత్త సీరియల్స్.. ఎవరు చూస్తారు అని అంటారు ఇంట్లోవాళ్ళు. కానీ వాళ్ళకి ఏం తెలుసు.. ఇంట్లో భార్యలకు పని ఐపోగానే సీరియల్సే చూస్తారు అని.. ఒకటా ? రెండా? మధ్యాహ్నం 12 గంటలకు మొదలు అన్ని సీరియల్స్ కంటిన్యూగా చూస్తూనే ఉంటారు.. 

 

కొందరు ఆడవాళ్ళకి సీరియల్స్ ని మించిన వేరే టైమ్ పాస్ లేదు.. ఎంతలా అడిక్ట్ అయ్యి చూస్తారు అంటే.. ఆ రోజు వచ్చిన ఎపిసోడ్ గురించి అది ఏదో వాళ్ళ నిజ జీవితంలో జరిగిన ఘటన లాగా వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తారు.. సీరియల్స్ లో యాక్ట్ చేసి స్టార్స్ అయినా యాక్టర్స్ చాలామంది ఉన్నారు. 

 

మన చిన్నప్పుడు అయితే ఎన్ని సీరియల్స్ వచ్చేవో.. మన చిన్నప్పుడు అంటే 1990స్ తో 2005 వరుకు. ఇంట్లో హోమ్ వర్క్ చేస్తూ.. తింటూ ఈ సీరియల్స్ ని చూస్తూ ఉండేవాళ్ళం.. ఇంకా 8:30 ఆ సమయం అయ్యింది అంటే సీరియల్ చూస్తూనే నిద్రపోయే వాళ్ళం.. అలా ఉండేది జీవితం.. 

 

అయితే అప్పట్లో కళ్యాణి సీరియల్ లో నటించిన హీరోయిన్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.. కనిపించడం పక్కన పెడితే అసలు ఆమె ఏం చేస్తుందో కూడా తెలియకపోయే.. ఆమె పేరు గాయిత్రి.. ఆరు, ఏడు భాషల్లో మాట్లాడగలిగే నటి ఎవరైనా ఉన్నారు అంటే అది గాయిత్రిని. అప్పట్లో దూరదర్శన్ లో వచ్చిన ఓం నమ శివాయ సీరియల్ లో పార్వతి దేవి పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యింది ఈమె.  

 

అప్పట్లో బాలాజీ టెలి ఫిల్మ్స్ సౌత్ లో ప్రొడ్యూస్ చేసిన చాలా సీరియల్స్ లో గాయిత్రినే లీడ్ హీరోయిన్.. అలా ఉండేది ఆమె స్టార్.. పవిత్ర బంధం.. కళ్యాణి.. మెట్టెల సవ్వడి.. దేవత ఇలా కొన్ని ఫేమస్ సీరియల్స్ లో లీడ్ రోల్ ఈమెది. ప్రస్తుతం అయితే ఎక్కడ నటించకుండా.. పూర్తిగా కుటుంబానికే అంకితం అయ్యింది.. మరి ఈ గాయిత్రి.. అదే మన కళ్యాణి సీరియల్స్ లో యాక్ట్ చేస్తారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: