చక్రవాకం.. మంజుల నాయుడు దర్శకత్వం వహించిన ఈ సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అబ్బా అని మీకు అనిపించచ్చు.. కానీ అప్పట్లో ఈ సీరియల్ ఎంత ఫేమస్ అంటే ఇప్పుడు స్టార్ మా లో వస్తున్న కార్తీకదీపం సీరియల్ అంత ఫేమస్.. అప్పుడంటే సోషల్ మీడియా లేదు కానీ.. ఉండి ఉంటే కార్తీకదీపం  కంటే ఎక్కువ ఫేమస్ అయ్యేది.. 

 

ప్రతి ఇంట్లో టీవిలో చక్రవాకం సీరియల్ అనేది ఖచ్చితంగా పెట్టేవాళ్ళు.. అప్పట్లో 8 : 30 నిమిషాలు అయ్యింది అంటే చాలు ఇంట్లో వాళ్ళతో గొడవ పడైన రిమోట్ లాక్కొని జెమినీ టీవీ పెట్టేవాళ్ళు.. చక్రవాకం సీరియల్ అయ్యాకనే ఏమైనా అనేవాళ్ళు.. అంత బాగుండేది సీరియల్. ఇంకా ఆ సీరియల్ లో హీరో హీరోయిన్ కే కాదు విలన్స్ కి కూడా ఫాన్స్ ఉన్నారు. 

 

హా ఆ సీరియల్ ఫేమస్ కదా! అందుకే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఫాన్స్ ఎక్కువ. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించి అందరి మనసు దోచుకున్న నటి ఒకరు ఉన్నారు. ఆమె ఆ సీరియల్ లో స్రవంతి. ఇంకా ఆమె రియల్ పేరు ప్రీతీ అమీనా. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన ప్రీతీ అమీనా.. 

 

కొన్ని సినిమాలలో చిన్న పాత్ర అంటే అతి చిన్న పాత్రలలో నటిస్తున్నా ఈమెకు చక్రవాకం సీరియల్ లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసింది. దీంతో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది.. 5 ఏళ్ళు సాగిన ఈ సీరియల్ అవ్వగానే మళ్లీ నాన్న అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని యుఎస్ఏ లో సెటిల్ అయ్యింది అని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: