సుమ... సుమ కనకాల.. బెస్ట్ యాంకర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ.. యాంకర్ అంటే చాలు సుమ అనేస్తారు.. పెద్ద సినిమాలకు సుమక్కే కావాలి చిన్న సినిమాలకు సుమక్కే కావాలి.. టీవీపై వచ్చే ప్రతి ఆడియో ఫంక్షన్ కు, టీవీ లో వచ్చే 50 % షోలకు ఆమె యాంకరింగ్ నిర్వహిస్తుంది. ఏ ఛానల్ పెట్టిన అడా ఉంటా.. ఇడా ఉంటా అన్నట్టు వ్యవహరిస్తుంటుంది సుమక్క. 

 

నిజం చెప్పాలి అంటే సుమక్క అసలు మన తెలుగు అమ్మాయే కాదు.. కేరళలో పుట్టింది... తెలుగు ఇండస్ట్రీలో ఇంత క్రేజ్, ప్రతి తెలుగు ఇంట్లో ఇంత ప్రేమ సంపాదించింది అంటే ఆమె తెలివితేటలతో పాటు ఆమె హార్డ్ వర్క్ కూడా కారణమే. ఇంకా అలాంటి సుమక్క ఒక ప్రోగ్రాం చేసింది అంటే సంవత్సరాలు గడవాల్సిందే కానీ షోస్ మాత్రం పూర్తి అవ్వవు. 

 

ఇంకా అలానే సుమక్క మన చిన్నప్పటి నుండి ఇప్పటి వరుకు యాంకర్ గా ఎన్నో అద్భుతమైన షోస్ చేశారు. అందులో ఒక బెస్ట్ షో స్టార్ మహిళా.. ఎప్పుడో 2008లో స్టార్ట్ అయినా ఈ షో 2019 వరుకు ఎక్కడ బ్రేక్ లేకుండా ఈటీవీలో వస్తుంది అంటే ఈ షో కి ఎంత క్రేజ్ ఉందో మీరు చూడండి..

 

అసలు 12 ఏళ్ళు ఒక టీవీ షో నడవడం అనేది సాధారణామైన విషయం కాదు.. ఏ షో కూడా ఏకంగా 12 ఏళ్ళు అయితే నడవలేదు.. ఎక్కువ కాలం వచ్చాయి కానీ 12 ఏళ్ళు రాలేదు.. ఈ షో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఇంకా అంతే కాదు.. స్టార్ మహిళా కార్యక్రమానికి ప్రతి రోజు అరుగు కొత్త గెస్టులు వచ్చారు తప్ప.. వచ్చిన వారు ఎవరు ఈ షో కి రాలేదు.. ఒక్క ఈ షో నే కాదు క్యాష్ ప్రోగ్రాం కూడా అంతే మరి. క్యాష్ ప్రోగ్రాం కూడా ఎక్కువ కాలం నుండి టీవిలో వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: