అవును.. పాపం సీరియల్ ప్రేక్షకులు.. ఎంత దారుణంగా మోసపోయారు అంటే అంత దారుణంగా మోసపోయారు.. ఈ కరోనా వైరస్ వల్ల తెలిసొచ్చింది అందరికి.. సీరియల్స్ చూడటం మంచిది కాదు.. బ్రెయిన్ కి హానికరం అని.. అయినా ఏం ఉపయోగంలే.. మళ్లీ సీరియల్స్ వేసిన చేసేస్తారు.. అంత పిచ్చి సీరియల్స్ అంటే.. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే సీరియల్స్ అంటే పడి చచ్చేవారి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. సాధారణంగా సీరియల్స్ ఒక్క ఆదివారం తప్ప ప్రతి రోజు వస్తున్నాయ్. అంత బాగా నడుస్తుంది.. నల్ల దీప కష్టాలు త్వరలోనే తీరిపోతాయి.. పార్థు శ్రీవల్లి పెళ్లి త్వరలోనే జరిగిపోతుంది అని అందరూ ఊహించారు.. 

 

కానీ అనుకోకుండా ఒక వైరస్ భారత్ లో కి ఎంటర్ అయ్యింది.. ఎదురెళ్ళిన ప్రతి ఒక్కరికి అంటుకొని చుక్కలు చూపించింది. ఇంకా ఆ వైరస్ ని ఎవరు తరిమేయ్యలేరు అని ఫిక్స్ అయ్యారు.. ఆ సమయంలోనే సినిమా నుండి సీరియల్ వరుకు ప్రతి ఒక్కటి షూటింగ్ ఆపేశారు.. ఇంకేముంది.. అడ్వాన్స్ ఉన్న ఎపిసోడ్స్ అన్ని వేసేశారు.. 

 

పది రోజుల్లో ఆ ఏపిసోడ్స్ అన్ని పూర్తయ్యాయి.. తర్వాత లేవు.. సీరియల్ నిర్వాహకులు సరే.. కరోనా అని తప్పించుకున్నారు.. కానీ సీరియల్ ప్రతి రోజు చూసే వారు ఎలా? రేపు ఏం అవుతుంది అని ఎంతో ఉత్కంఠంగా సీరియల్ కోసం ఎదురు చూసే వారికీ పిచ్చి పట్టినట్టు అయ్యింది.. అయినా ఏం చేస్తారు పాపం.. మనసులో తిట్టుకొని.. కరోనా వైరస్ అంతం అవ్వాలి అని కోరుకోవడం తప్ప.. చూద్దాం.. ఈ సీరియల్స్ ఎప్పటి నుండి వస్తాయో.                                                

మరింత సమాచారం తెలుసుకోండి: