తెలుగు బుల్లితెరపై తన గ్లామర్ షో‌తో ప్రేక్షకుల్ని అలరించిన అనసూయ రోజురోజుకు ముందుకు దూసుకు వెళుతుంది. ఇక ఒక వైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు టాలీవుడ్ సినిమాల్లో మంచి ఛాన్సులు కొట్టేస్తోంది. మరి మన అనసూయకు ఉన్న క్రేజ్ మరి అలాంటింది. కెరియర్ ప్రారంభంలో న్యూస్ రీడర్ ‌గా ప్రారంభించిన ఆ తర్వాత టీవీ షోలతో మంచి పాపులారిటీ తన సొంతనమ్ చేసుకుంది. ఇక జబర్దస్త్ కామెడీ షోకు అనసూయకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే కదా.

 

ఇక దీనితో ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే మంచి ఛాన్స్ లు దొరికినప్పుడల్లా సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తుంది. ఆ అమ్మడు అంతేకాదు, స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. ఇక రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులనే కొట్టేసింది అనసూయ. ఇకపోతే తాజాగా అనసూయ చిరంజీవి కొత్త చిత్రం ఆచార్య సినిమాలో కూడా నటించనంత బోతున్నట్లు సమాచారం.

 


ఇది అంత ఇలా ఉండగా, టాలీవుడ్ ‌లో బిజీగా మారిన అనసూయకి ఇప్పుడు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందట. ఇకపోతే ఇది సినిమాల్లో కాదు. అక్కడ హిందీలో టాప్ రేటింగ్ ‌తో దూసుకెళ్లున్న టీవీ సీరియల్ ‌లో లీడ్ రోల్ చేసేందుకు ఆఫర్ వచ్చింది. నిజానికి బాలీవుడ్ ‌లో చాలామంది నటీనటులు ఆ సీరియల్స్ చేసి వచ్చిన వాళ్లే. ముందుగా టీవీలో అసలు తాము అంటే ఏమిటి, మేము ఏమి చేయగలము.. తన టాలెంట్ ఏంటో అన్ని నిరూపించుకొని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చినవారు ఎందరో ...  ఇక ఇప్పుడు అనసూయకు కూడా ఇలా హిందీ టాప్ సీరియల్‌ లో అవకాశం రావడంతో అది కూడా మెయిన్ రోల్ కావడంతో ఆమె కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.

 

అయితే ఆ సీరియల్ ‌లో నటించేందుకు చాలా తక్కువ రోజులే డేట్స్ అనసూయను అడిగినట్లుగా విషయం తెలుస్తోంది. ఇక దీని కోసం డేట్స్ కూడా ఎడ్జస్ట్ కావడంతో దీనికి అనసూయ కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఇందులో ఒకవేళ బాలీవుడ్ సీరియల్ ‌లో అనసూయ సక్సెస్ అయితే గనుక... ఆ తర్వాత ఆమెను బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కూడా చూసే అవకాశాలు లేకపోలేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: