శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రాములు చేసి వావ్ అనిపించినా యాంకర్ శ్రీముఖి.. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ప్రతి చోటా మంచి మంచి ప్రోగ్రాముల్లో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఆహా అనిపించింది. 

 

ఇంకా అలాంటి శ్రీముఖి ఇటీవలే జరిగిన బిగ్ బాస్ 3 కి వచ్చి రన్నర్ గా మిగిలిన విషయం తెలిసిందే. ఇంకా అంతే కాదు.. రన్నర్ అయినప్పట్టి గెలిచినా దానికంటే ఎక్కువ అల్లరి చేస్తూ ఇంటికి చేరుకుంది ఈ భామ. ఇంకా అలాంటి ఎనర్జిటిక్ శ్రీముఖి ఇప్పుడు పెళ్లిపై నోరు విప్పింది.. 

 

ఆమె లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్తుంది.. అంతే కాదు ఆమె కాబోయే వాడు ఎలా ఉండాలి అనేది కూడా చెప్పేస్తుంది. లవ్ అంటే లైఫ్ టైమ్ కమిట్మెంట్ ఉండేవి.. ఎప్పటికి అన్నింటికంటే తనే ఎక్కువ అనిపించడం.. పెళ్లి ఇప్పుడు చేసుకోవాలి అని అనుకోలేదు కానీ మూడు నాలుగేళ్లు వరుకు అయితే పెళ్లి వద్దు అని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. 

 

అంతేకాదు.. వాళ్ళ ఇంట్లో లవ్ అంటే ఒకప్పుడు ఒప్పుకునేవారు కాదు అని తెలుసుకున్నట్టు.. కానీ ఇప్పుడు కుటుంబం తన నిర్ణయాలకు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అందుకు ఒప్పుకుంటారు అని ఆమెకు దైర్యం వచ్చినట్టు చెప్పారు.. ఇంకా అలాగే ఆమెకు కావాల్సిన వాడు ఎలా ఉండాలి అనేది కూడా చెప్పారు. 

 

నాకు ఒక అబ్బాయి నచ్చాలంటే నాలానే ఉండాలి. అంటే ఎనర్జీలెవెల్స్‌లో, కామెడీలో అలాగే నాలాగే కొంచెం పిచ్చి ఉండాలి. వెర్రి ఉండాలి. నాకు నిజానికి రణవీర్ సింగ్ అంటే చాలా ఇష్టం. అతడిలానే ఆ అబ్బాయి హైపర్ కూడా ఉండాలి. సేమ్ టైమ్.. బయట అందరికీ నాలానే అల్లరిగా ఉన్నా.. కొన్ని సార్లు ఇన్నోసెంట్‌గా కూడా ఉండాలి. అదెలా అంటే.. బేబీలానూ.. మెచ్యూర్‌గానూ ఉండాలి. నాకైతే చాలా ఘోరమైన ఎక్స్‌పర్టేషన్స్ ఉన్నాయి. నాకు బేసిక్ గానే సద్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది. సో ఇలాంటి అబ్బాయి అయితే నాకు నచ్చుతుంది. ఇదంతా వినేవాళ్లకి ''పిచ్చి నీకైనా ఉండాలి లేదా వెర్రి నాకైనా ఉండాలి'' అనుకుంటాను కానీ.. ఇవే నా కోరికలు అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. 

మరింత సమాచారం తెలుసుకోండి: