దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తూ ఉండటంతో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తోంది. లాక్ డౌన్ వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ ఆగిపొయాయి. గత కొన్నేళ్లుగా బుల్లి తెర వెండితెరకు పోటీ ఇస్తోంది. లాక్ డౌన్ లో కూడా జబర్దస్త్, కార్తీకదీపం టిఆర్పీల్లో కొత్త రికార్డులు సృష్టించాయి. 

 


స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ బుల్లితెర బాహుబలిగా పేరు తెచ్చుకుంది. సరికొత్త ట్విస్టులు, భావోద్వేగాలు కార్తీకదీపం సీరియల్ ను సూపర్ హిట్ చేశాయి. టీవీల్లో స్టార్ హీరోల కొత్త సినిమాలు ప్రసారమైనా కార్తీకదీపం టీఆర్పీ రేటింగ్ ముందు దిగదుడుపే. కరోనా విజృంభణతో సీరియల్ షూటింగ్స్ ఆగిపోయినా బుల్లితెరపై వంటలక్క క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. 
 


స్టార్ మా ఛానెల్ నంబర్ 1 పొజిషన్ లో ఉండటానికి కారణమైన కార్తీకదీపం లాక్ డౌన్ మంచి రేటింగ్స్ అందుకుంటోంది. కార్తీకదీపం పాత ఎపిసోడ్లను ప్రసారం చేస్తూ ఉండగా గత వారం ఈ సీరియల్ కు 6.88 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. కార్తీకదీపం అభిమానులు ఆ సీరియల్ ను ప్రతిరోజూ మిస్ అవ్వకుండా చూస్తూ ఆ సీరియల్ క్రేజ్ ఏంటో టీఆర్పీ రేటింగ్ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. 
 


మొదట్లో కార్తీకదీపం సీరియల్ ను ఫాలో కాని వారు రీవిజిట్ లో సీరియల్ చూస్తూ డాక్టర్ బాబు మంచితనం గురించి , సౌందర్య అహం గురించి తెలుసుకుంటున్నారు. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్న నిరుపమ్ రీవిజిట్‌లో సీరియల్ చూస్తున్నవారు డాక్టర్ బాబు కూడా మంచివాడే అని సరిఫికెట్ ఇస్తున్నారని తాజాగా లైవ్ లోకి వచ్చిన సమయంలో చెప్పారు. మొత్తానికి రీవిజిట్ లోనూ కార్తీకదీపం సీరియల్ సూపర్ హిట్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: