మనం చిన్నగా ఉన్నప్పటి నుండి.. కాదు కాదు మన తాత వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుండి దూరదర్శన్ లో వచ్చే ప్రోగ్రామ్స్ ప్రత్యేకమైనవి.. ఇప్పుడు అంటే లెక్కలేనన్ని ఛానెల్స్ ఉన్నాయ్ కానీ అప్పట్లో ఏ ఛానెల్స్ ఉన్నాయి? అసలు విధికి ఒక టీవీ ఉండటమే కష్టం.. ఇంకా అలా టీవీ ఉన్న చోటికి విడి జనాలు అంత వెళ్లేవారు. 

 

ఇంకా అక్కడ రామాయణం, శివమ్, భాగవతం ఇలా అన్ని సీరియల్స్, ప్రోగ్రామ్స్ వచ్చేవి.. జనాలు అంత చూసి అబ్బా పార్వతి దేవి ఎంత అందంగా ఉంది కదా!.. రామాయణంలో రాముడు ఎంత బాగున్నాడో.. సీత ఎంత అందంగా ఉందో అని అనేవాళ్ళు. ఇంకా కథ కూడా చాలా అద్భుతంగా ఉండేది. అందుకే దూరదర్శన్ లో వచ్చే సీరియల్స్ అన్న ప్రోగ్రామ్స్ అన్న జనాలు పది చచ్చిపోయే వాళ్ళు. 

 

ఇప్పుడు ఉన్న ఏ ఛానల్ దూరదర్శన్ తో సమానం కాదు.. అప్పట్లో ఓ రేంజ్ ఉండేది ఈ దూరదర్శన్. అప్పట్లో దూరదర్శన్ లో వచ్చే ప్రోగ్రామ్స్ కోసం జనాలు ఎంత ఎదురు చూసేవాళ్ళో. పేరుకి తగ్గట్టుగా ప్రోగ్రాం కంటెంట్, క్వాలిటీ ఉన్న ప్రోగ్రామ్స్ అవి. ఇప్పుడు అందులో నుండి కూని బ్లాక్ బస్టర్ సీరియల్స్, ప్రోగ్రామ్స్ ఏంటో చూద్దాం. 

 

1. ఋతురాగాలు.. ఈ సీరియల్ తెలుగులో అందరికి గుర్తుండిపోయే సీరియల్. 

 

2. ఓం నమః శివాయ..  శివుడు బేస్ వాయిస్ లో ఓమకరం సౌండ్ వినిపించేదట.. 

 

3. రామాయణం.. భక్తి పారవశ్యంలో మునిగిపోయిన భక్తి సీరియల్. 

 

4. శక్తిమాన్.. పిల్లలని టీవీ కి అతుకొని పోయేలా చేసిన సీరియల్ ఇది. 

 

5, చిత్రలహరి.. యూట్యూబ్ లో ఇప్పుడు జుక్ బాక్స్ ఎలాగో, అప్పట్లో ఇది కూడా సేమ్ టూ సేమ్ హిట్స్ అండ్ పాపులర్ సాంగ్స్ కి కేర్ అఫ్ అడ్రెస్స్. 

 

6. మహాభారత.. భక్తి సీరియల్ ఇది. 

 

7. విక్రమ్ బేతల్.. పట్టు వాదులని విక్రమాదిత్యుని కథ. 

 

8. అల్లాద్దీన్.. అల్లాద్దీన్ లో జిని అందించిన ఫాంటసీ లోకం. 

 

ఆ రోజుల్లే వేరబ్బా.. ఆ ప్రోగ్రామ్స్, సీరియల్స్ తలచుకుంటేనే ఒక మంచి ఫీల్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: