కరోనా వైరస్ కారణంగా రోజురోజుకీ ఇటు బుల్లితెర అటు సినిమా పరిశ్రమలో కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఇక చివరికి ప్రేక్షకులు బాగా ఆదరించిన గేమ్ షోలు, రియాలిటీ షోలు పరిస్థితి ఇక చెప్పక్కర్లేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కంటెంట్, సదరు ప్రోగ్రామ్ యొక్క డిజైన్ మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక ఇది ఇలా ఉంటే కొన్ని షోలపై అసలు కొనసాగిస్తారా అన్న ప్రశ్న వస్తోంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ సుమ, యాంకర్ ఝాన్సీ హోస్ట్ లుగా నిర్వహించే కొన్ని షోలను నిలిపివేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట ఇక వాటి పూర్తి వివరాలు తెలుసుకుందామా.... 

 

ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో షూటింగులు తొందరలో మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే కొన్ని గేమ్స్ ఇవాళ పరిస్థితి మాత్రం సందేహంగా మారాయి. అందులో ఒకటి " వైఫ్ చేతిలో లైఫ్ ", మరోటి " పరివార్ లీగ్ సీజన్  2 " ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో చేతిలో లైఫ్ కార్యక్రమాన్ని యాంకర్ సుమ హోస్ట్ గా నిర్వహిస్తోంది. అయితే ఇప్పటివరకు షూట్ చేసిన ఎపిసోడ్ ని మాత్రం ప్రసారం చేసిన తర్వాత ఆ షోను నిలిపివేయాలని ఆలోచన ఉన్నట్లు బుల్లితెర వర్గాలు తెలుపుతున్నాయి. నిజానికి ఈ షోలో ఆడియన్స్ పాల్గొనాల్సి ఉంటుంది. ప్రస్తుత లాక్ డౌన్ స్థితిలో ఇంత మంది ప్రేక్షకులు పాల్గొనాలని అంటే కష్టం కాబట్టి షో నిలిపి వేయడమే కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. 


మరో వైపు యాంకర్ ఝాన్సీ హోస్ట్ గా సెలబ్రిటీలతో నిర్వహిస్తున్న షో పరివార్ లీగ్ సీజన్ 2. అయితే సెలబ్రిటీలతో షో నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి స్టూడియోలో ఇలాంటి ఎపిసోడ్ చిత్రీకరించాల్సి అవసరం ఉంది. కాబట్టి ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఈ షో తాత్కాలికంగా వాయిదా వేయాలని భావిస్తున్నట్లు కొన్ని వర్గాలు తెలుపుతున్నాయి. లాక్ డౌన్ నిబంధన కారణంగా ఈ షోను కూడా సాధ్యమైనంత తొందరగా ముగించాలని ఆలోచనలో ఉన్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: