మనకు త్వరలోనే ఓ కష్టం రానుంది.. కాదు కాదు.. నిజంగానే ఆ కష్టం ఇప్పటికే వచ్చేసింది. అదే సీరియల్స్ పేర్ల కష్టాలు. ఏంటి అని మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు కానీ.. నిజంగానే సీరియల్స్ కి పేర్ల కష్టం వచ్చింది. ఎందుకు అని మీకు అనిపించచ్చు.. కానీ ఈ సీరియల్స్ పేర్లు చూస్తే మీకు తెలుస్తుంది. నిజంగానే ఈ సీరియల్స్ కి చాలా పెద్ద కష్టం వచ్చింది అబ్బా అని. 

 

మనం టీవీ చూస్తుంటాం.. ఉన్నట్టుండి ఓ మంచి సినిమా పేరు పడుతుంది.. అబ్బా ఈ టీవీ వాడు గొప్పోడు అని అనుకుంటామొ లేదో అది సీరియల్ అని తెలుస్తుంది. ఇంకా కొన్ని కొన్ని సార్లు అయితే... అమ్మ వాళ్ళు ఆ సీరియల్ పేరు చెప్తారు.. రేయ్.. నువ్వు నాకు వచ్చావ్ ఆ ఛానెల్ లో వచ్చి ఉంటుంది.. పెట్టి చావు రా అని. కానీ అది చూస్తే తెలుస్తుంది.. సినిమా కాదు సీరియల్ అని. ఇలా కొన్ని సీరియల్ పేర్లు ఉన్నాయ్.. అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

1. నువ్వు నాకు నచ్చావ్.. జెమినీ టీవీ. వెంకటేష్ సినిమా కాదు సీరియల్. 

 

2. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇందులో రేలంగి మామయ్య నవ్వు ఉండదు కేవలం హీరోయిన్ ఏడుపు ఉంటుంది. ఎందుకంటే ఏది సీరియల్ కాబట్టి. 

 

3. ఏమాయ చేసావే.. సామ్ చై సినిమా కాదు.. కానీ హీరో హీరోయిన్ స్టోరీ సినిమా కంటే బాగుంటుంది. 

 

4. అత్తారింటికి దారేది.. పవన్ కళ్యాణ్ సినిమా కాదండోయి. 

 

5. గుండమ్మ కథ.. ఇందులో సావిత్రి ఉండదు.. ఇది సీరియల్. 

 

6. నిన్నే పెళ్లాడతా... ఆ ఛానెల్ లో ప్రసారం అయ్యే వింత

సీరియల్. 

 

7. రంగస్థలం.. ఇది సినిమా కాదు సీరియల్ కాదు.. ప్రోగ్రాం. 

 

8. గీత గోవిందం.. విజయ్ దేవరకొండ సినిమా అయితే కాదు. 

 

9. గీతాంజలి.. కొత్త సినిమా కాదు.. పాత సినిమాను కాదు. 

 

10.  శ్రీనివాస కళ్యాణ్.. బిగ్ బాస్ మంచోడు సీరియల్. 

 

11. ఎవరు.. అడవి శేష్ ఎవరు సినిమా అయితే కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: