ఇప్పుడు అంటే లాక్ డౌన్ కాబట్టి టీవీ లో వచ్చే ఏవో ఒకటి చూస్తున్నాం. అదే లేకుంటే మనం అసలు టీవీని చూస్తామా ? అసలు చూడము. ఎందుకంటే ఇప్పుడు టీవిలో అంత గొప్ప ప్రోగ్రామ్స్, సీరియల్స్ రావడం లేదు కాబట్టి. ప్రతి ప్రోగ్రాం అదేలా నడుస్తుంది. కంటెంట్ ఏం ఉండదు.. ఏదో ప్రోగ్రామ్స్ చెయ్యాలి అంటే చెయ్యాలి అనిపించేలా ఉంటుంది. 

 

IHG's twins for Udaya Bhanu - Times of India

 

అయితే ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కానీ అప్పట్లో మాత్రం చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ వచ్చేవి. అవి కూడా జెమినీ టీవిలో మాత్రమే అద్భుతమైన ప్రోగ్రామ్స్ వచ్చేవి. అప్పట్లో జెమిని టీవిలో మంచి కంటెంట్ ఉండేది. అందుకే అప్పుడు జెమినీ టీవీ సూపర్ టీవీ అయ్యింది. కానీ ఇప్పుడు అంతమంచి కంటెంట్ లేకుండా పోయింది. టీఆర్పీ పడిపోయింది. 

 

IHG

 

అప్పట్లో జెమినీ టీవిలో మనల్ని అలరించిన అద్భుతమైన ప్రోగ్రామ్ లు ఇవే.. టాక్ ఆఫ్ ది టౌన్, పట్టుకుంటే పట్టుచీర, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చెయ్యరా డింభకా, ఆట కావాలా పాట కావాలా, కొత్త సినిమా గురు, నిజం బాబులు ఇలా అప్పట్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ టీవిలో వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకురావాలి అని చూస్తున్నారు కానీ ఎక్కడ రావడం లేదు.. ఎందుకంటే అంత మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా!

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: