ఈతరం ఇల్లాలు.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సీరియల్ అంత అద్భుతంగా ఉండేది. అలాంటి అద్భుతమైన ఈ సీరియల్ లోని కొన్ని అద్భుతమైన పాత్రలు ఉన్నాయ్. అలాంటి అద్భుతమైన పాత్రలో మొదటి పాత్ర సంధ్య పాత్ర. ఈతరం ఇల్లాలు సంధ్యనే. 

 

చదువుపైన అసలు ఏమాత్రం అవగాహనాలేని, చదువుకు విలువ లేని ఓ కుటుంబానికి చదువుకున్న కోడలు వస్తుంది ఆమె సంధ్య. ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఓటు అనేది మనిషి హక్కు అని కూడా ఆ కుటుంబానికి తెలీదు. అలాంటి ఇంటికి సంధ్య కోడలుగా వస్తుంది. 

 

ఆ ఇంట్లో ఒక్కొకటి మార్చుకుంటూ వస్తుంది. అత్త నమ్మే పాతకాలపు విషయాలను, పద్దతులను నేర్చుకొని ఆ విషయాలలో ఎన్ని తప్పులు ఉన్నాయ్ అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఇంకా తోడు కోడలు దుర్బుద్ధిని మర్చి ఇంటికి అనుగుణంగా మారుస్తుంది. అంతేకాదు ఒక సందులో వంట చేసుకొని ఉండే భర్త సూర్యను ప్రపంచ వంటల పోటీల్లో పాల్గొనేలా చేసి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. 

 

అలాంటి ఈతరం కోడలు సంధ్య. ఇంకా అలాంటి సంధ్యకు పెళ్లికి ముందు మంచిగా చదువుకొని ఐపీఎస్ అవ్వాలి అనేది ఆమె కోరిక. అలాంటి సంధ్య జీవితం పెళ్లితో ఇల్లాలిగా మారిపోతుంది. ఇంకా అలాంటి సంధ్య కళను తెలుసుకున్న భర్త తనను చదివిని ఐపీఎస్ చెయ్యాలి అనుకుంటాడు. అలా చెయ్యాలి అని ఎప్పుడు కన్నతల్లిని ఎదురించిన సూర్య ఎదురించి తన కళను సాకారం చేస్తాడు. చివరికి సంధ్య అత్త కూడా సంధ్యకు సపోర్ట్ చేసి ఐపీఎస్ చేస్తుంది. అది సంధ్య పాత్ర. నిజంగా అద్భుతం కదా! అలాంటి కోడలు ఈ అత్తకు వస్తుంది. ఇంటిని అందంగా మార్చుకున్న కోడలే అద్భుతమైన కోడలు.           

మరింత సమాచారం తెలుసుకోండి: