వంటలక్క.. ఈ అక్క గురించి ఎంత చెప్పిన తక్కువే. కార్తీకదీపం సీరియల్ లో నల్ల దీపగా పరిచయం అయినా ఈ నటి మంచి నటనతో సెల్ఫ్ రెస్పెక్ట్ లేడీగా ఓ రేంజ్ లో అందరిని ఆకట్టుకుంది. అసలు ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు. కార్తీకదీపం సీరియల్ లో ఈమె ఒకరోజు కనిపించకుంటే చాలు వంద మెసేజ్ లు పెట్టేస్తారు. 

 

IHG

 

అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ వంటలక్కకు. ఇంకా అలాంటి ఈ వంటలక్కకు సోషల్ మీడియాలో అయితే చెప్పలేనంతమంది ఫ్యాన్స్. అక్కపైనే జోకులు వేస్తారు.. అక్కనే తిడుతారు. తిట్టడం కూడా ప్రేమగానే తిడుతారు అనుకోండి. అది వేరే విషయం. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఇలా ప్రతి ఒక్కదానిలో ఈ నల్లదీపకు బోలెడంతమంది ఫ్యాన్స్. 

 

IHG

 

ఇది అంత ఓకే అనుకుంటే ఇప్పుడు టిట్ టాక్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అంటే వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా 1.4 మిలియన్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏంటి ఒక సీరియల్ స్టార్ కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారా ? అని మీరు షాక్ అవ్వచ్చు. కానీ నిజం అండి. ఆమెకు నిజంగానే బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. 

 

IHG

 

ఇంకా ఈ కార్తీక దీపం సీరియల్ వంటలక్కకే ఇంతమంది ఫ్యాన్స్ ఉంటే డాక్టర్ బాబుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉండాలి మీరే చెప్పండి! కానీ డాక్టర్ బాబుకు అంతమంది ఫ్యాన్స్ లేరు. ఆఖరికి వంటలక్క భర్త అయినా సౌందర్యకు కూడా అంతమంది ఫ్యాన్స్ లేరు. అంటే దీన్ని బట్టి చూస్తే.. వంటలక్క భర్త, అత్తకంటే కూడా టిక్ టాక్ లో వంటలక్కనే గ్రేట్ అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: