కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ కరోనా ఎఫక్ట్ కారణంగా సీరియల్ షూటింగ్స్, సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోవడంతో బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద షాక్ ఏ తగిలింది. ఎప్పుడు సీరియల్స్ చూస్తూ ఉండిపోయే ఆడవాళ్లకు సీరియల్స్ అల్లాడిపోయారు.  

 

ఇంకా ఈ నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్‌గా ఆగిపోయిన షూటింగ్స్ అన్ని పున:ప్రారంభం అయ్యాయి. దీంతో సీరియల్స్ అన్ని కూడా ప్రోమోలతో అదరకొడుతున్నారు. నిన్నటి నుండి కొన్ని ఛానెల్స్ లో సీరియల్స్ ప్రారంభం అయ్యాయి... ఇంకా పాపులర్ షో అయినా జబర్దస్త్ ప్రోమో కూడా పడింది. ఇక బుల్లితెరపై ఎప్పుడు అల్లరి చేస్తూ కామెంట్లు చేసే సుమ షో క్యాష్ కూడా వచ్చే వారానికి రెడీ అయిపోయింది.

 

IHG

 

దీంతో సుమ అదిరిపోయే డైలాగులు కొడుతూ.. ఆఫ్టర్ గ్యాప్ క్యాష్ ఈజ్ బ్యాక్ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఇంకా ఈ శనివారం రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.. క్షణాల్లో వైరల్ అయ్యింది అంటే నమ్మండి.. ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండి.. ఈ వారం క్యాష్ ప్రోగ్రామ్‌కి వచ్చింది ఎవరో కాదు. 

 

బిగ్ బాస్ కంటెస్టెంట్స్... రాహుల్ సిప్లిగంజ్, హిమజ, అషు రెడ్డి, రోహిణిలు పంచ్‌లతో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు. ఇంకా 5 నిమిషాలకుపైగా ఉన్న ఈ ప్రోమోలో సుమ కసక్కులా ఉన్న అనే డైలాగ్ తెగ వైరల్ అవుతుంది అంటే నమ్మండి. ఇంకా ఓవర్ అల్ గా ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా ఉంది. అందులో ఏలాంటి సందేహం లేదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: