బిత్తిరి సత్తి.. తనదైన యాసతో.. వింత వింత హావభావాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బిత్తిరి సత్తి అంటే చాలు ప్రతి ఒక్కరు గుర్తించే రేంజ్ లో అయన పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇంత పాపులారిటీ రావడానికి కారణం V6. బిత్తిరి సత్తి అంటే ఎవరో తెలియని సమయంలో అతని టాలెంట్ ను గుర్తించి V6లో తీన్మార్ వార్తలలో అవకాశం ఇచ్చి ప్రపంచానికి పరిచయం చేసింది. 

 

IHG

 

అయితే V6తో బిత్తిరి సత్తికి ఎంత పేరు వచ్చిందో.. బిత్తిరి సత్తితో V6కి అంతే పేరు వచ్చింది. టాప్ రేటింగ్ లో ఈ తీన్మార్ వార్తలు దూసుకెళ్లాయి. ఆ టాప్ రేటింగ్ చూసి అప్పట్లో టాప్ అయినా టీవీ9 ఓ మంచి ఆఫర్ తో తన ఛానెల్ లోకి లాగేసుకుంది. ఇంకా బిత్తిరి సత్తికి కూడా తనకు జీవితం ఇచ్చిన V6ను వదిలేసి టీవీ9లోకి జంప్ అయ్యాడు. 

 

IHG

 

అయితే టీవీ తీన్మార్ తరహాలోనే ఇస్మార్ట్ వార్తలు పెట్టి దాన్ని అలా అలా నడిపించాడు.. జ్యోతక్క రావడంతో షోకి మంచి రేటింగ్ కూడా వచ్చింది. అయితే ఇక్కడ V6కి టీవీ9కి చాలా తేడా ఉంది. V6లో తీన్మార్ వార్తలకు తన సొంత ఆలోచనలను అమలు చేసేవాడు. ఆ ఆలోచనలు ఎలా ఉన్న సత్తికి ఉన్న పాపులారిటికీ ఆ యాజమాన్యం ఒప్పుకునేది. 

 

IHG

 

కానీ టీవీ9లో అలా కాదు స్కిట్స్ విషయంలో బిత్తిరి సత్తి సొంత నిర్ణయాలు తీసుకోవడం యాజమాన్యానికి నచ్చలేదు.. పలు సార్లు హెచ్చరించారు.. మరకపోగా షో హిట్ అయినందుకు రెమ్యూనరేషన్ కూడా పెద్ద మొత్తంలో పెంచాలని బిత్తిరి సత్తి డిమాండ్.. ఇది అంత టీవీ9 యాజమాన్యానికి గిట్టలేదు.. ఇంకేముంది.. మంగళవారం నాడు బిత్తిరి సత్తిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

 

IHG

 

అయితే బిత్తిరి సత్తిని తొలిగిచ్చినట్టు టీవీ9 చెప్తుంటే కొందరు మాత్రం బిత్తిరి సత్తినే టీవీ9 ని వదిలేసినట్టు వార్తలు వస్తున్నాయి. లైఫ్ ఇచ్చిన V6నే వదిలేసినా బిత్తిరి సత్తికి టీవీ9 ఓ లెక్కనా? అని అంటున్నారు కొందరు నెటిజన్లు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. బిత్తిరి సత్తి ప్రస్తుతానికి V6కి, టీవీ9కి దూరం అయ్యాడు. మరి ఈ బిత్తిరి తర్వాత అడుగులు ఎటువైపు అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: