యాంకర్ సుమ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈమె కంటే టాప్ యాంకర్ అంటూ ఎవరూ లేరు.. ఇకపై వస్తారనే నమ్మకం కూడా లేదు.
గ్లామర్‌తో యాంకరింగ్ దూసుకుపోవాలని ఎంతో మంది వచ్చినా సుమను మాత్రం క్రాస్ చేయలేకపోతున్నారు. అలాగే ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టుకోవడంతో సుమ ముందుంటుంది.
ముఖ్యంగా మహిళా లోకం కోసం ప్రత్యేకంగా స్టార్ మహిళ అనే కార్యక్రమాన్ని సుధీర్ఘంగా నడిపి గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే ఎందరో అభిమానులు ఆకట్టకుంది. ఇక బుల్లితెర, వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ సుమకు భారీ ఫాలోంగ్ ఉంది.
ఈ నేపథ్యంలోనే సుమ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కూడా యాంకర్ సుమ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.