వంటలక్క.. ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు. అందరికి సుపరిచితురాలైన వంటలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఇంకా ఈ వంటలక్క షూటింగ్ కోసం అని గత వారం హైదరాబాద్ వచ్చింది. అయితే ఇప్పుడు షూటింగ్ ప్యాకప్ అవ్వడంతో వంటలక్క కేరళకు తిరుగు ప్రయాణం పట్టింది. 

 

సాధారణంగా అయితే ఈ విషయం గురించి మనం మాట్లాడం. కానీ వంటలక్క కొత్త యూట్యూబ్ ఛానెల్ స్టార్ చేసింది. ఆ యూట్యూబ్ ఆమె రోజంతా ఎం చేస్తుంది అనేది అంత వీడియో తీసి షేర్ చేస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రారంభంలో షూటింగ్స్ అంత వీడియో తీసి షేర్ చేసిన వంటలక్క ఇప్పుడు తను కేరళకు వెళ్ళింది కూడా వీడియో తీసింది. 

 

ఇంకా అలానే వంటలక్క హైదరాబాద్ తో కేరళకు ఇండిగో విమానంలో ప్రయాణం చేసింది. అయితే ఆ ప్రయాణం ప్రారంభం నుండి అంటే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తూ.. తను ఎక్కబోయే ఫ్లైట్ చూపిస్తూ, కొచ్చిన్‌లో లాండ్ అవుతూ వీడియో చేసింది వంటలక్క. ఇంకా ఆ వీడియోలో వంటలక్క ఫ్లైట్‌లో నుంచి ప్రకృతి అందాలను చూపించింది. 

 

అంతే కాదు కేరళా చేరిన తర్వాత కూడా... ''కొచ్చిన్‌లో లాండ్ అయ్యాను.. నేను నా ఇంటికి వెళ్తున్నాను.. సెక్యూటిరీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎయిర్‌పోర్ట్ లోపల షూట్ చెయ్యలేకపోయాను.. బై'' అంటూ వీడియో షేర్ చేసింది వంటలక్క. ఇంకా ఈ వీడియో చుసిన అభిమానులు.. ఈ కరోనా సమయంలో అవసరమా అక్క ప్రయాణాలు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసి వారం అయ్యిందో లేదో అప్పుడే వంటలక్కకు 45 వేలమంది సబ్ స్క్రైబర్స్ సొంతం అయ్యారు.           

 

మరింత సమాచారం తెలుసుకోండి: