బుల్లితెరపై ఎంతో మంది ప్రేక్షకుల మదిని గెలుచుకున్న సీరియల్ కార్తీక దీపం. అయితే ఈ సీరియల్ 776 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని 777 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈరోజు జరగబోయే ఎపిసోడ్స్ లో హైలెట్స్   ముందుగా మీకోసం. ముందు ఎపిసోడ్ లో సౌర్య కార్తీక్‌ని బతిమలాడటం, దాంతో కార్తీక్ టీసీ చింపెయ్యడంతో ఆ సమస్య తీరింది. అయితే హిమ టీసీని చూసిన సౌర్యకి ఓ లాజిక్ దొరకడంతో ఆ టీసీ పట్టుకుని.. ‘హిమా నేను ఒకే రోజు.. ఒకే నెల.. ఒకే సంంవత్సరంలో ఎలా పుట్టాం?’ అంటూ దీపని అడగడం. సమాధానం చెప్పకుండా తప్పించుకోవడంతో సౌర్య ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది.

 

 

సౌర్య ఎంక్వైరీలో భాగంగా సౌందర్యని కలిసి కూడా అదే ప్రశ్నలు వెయ్యడంతో.. తనలో తనే మదనపడుతుంది సౌందర్య. అయితే సౌందర్య ముందుకు సౌందర్య అంతరాత్మ వచ్చి... ‘భయపడకు.. ఏం జరిగితే అదే జరగని.. నువ్వు మాత్రం సౌందర్యగానే దీప వెన్నంటే మంచి అత్తగారిలానే నిలబడు’ అంటూ చెప్పడంతో సౌందర్య కాస్త కూల్ అవుతుంది.

 

 

సౌర్య దుప్పటి ముసుగు పెట్టి.. కార్తీక్ గురించి నెట్‌లో సర్చ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో దీప వచ్చి.. ‘ఫోన్‌లో ఏం వెతుకుతున్నావ్? అత్తమ్మా?’ అని అడగడంతో... ‘డాక్టర్ బాబు గురించి వెతుకుతున్నానమ్మా... డాక్టర్ బాబు గురించి నెట్‌లో చాలా సమాచారం ఉంది. అతడు ఏం చదువుకున్నాడు? ఎన్ని సర్జరీలు చేశారు? అన్నీ ఉన్నాయి కానీ.. ఫ్యామిలీ స్టేటస్‌లో ఒక్కర్తే కూతురు అని హిమ పేరు ఒక్కటే ఉందమ్మా..’ అనడంతో దీప షాక్ అవుతుంది.

 

 

అయితే ‘ఫంక్షన్ మాత్రం మన ఇంట్లో వద్దు.. ఆ వంటలక్క మనింటికి రావడానికి వీల్లేదు..’ అని కార్తీక్ చెప్పడంతో పాటు.. ‘భాగ్యం ఇంట్లో ఫంక్షన్ అయితే ఆమె రచ్చ భరించడం కష్టం’ అని కూడా అంటాడు. దాంతో వెంటనే హిమ.. ‘అయితే మన ఇంట్లోని వద్దు.. శ్రావ్య పిన్నీ ఇంట్లోనీ వద్దు.. వంటలక్క ఇంట్లో ఫంక్షన్ చేద్దాం’ అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: