తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్లు సుమ, అనసూయ షూటింగ్ కి బై బై చెప్పనున్నారు. అయితే పూర్తిగా కాదు లెండి.. కొద్దీ రోజులు మాత్రమే. కరోనా మహమ్మారి దారుణంగా విజృంభిస్తుండటంతో కొద్దీ రోజుల పాటు షూటింగ్ కి సెలవు పెట్టాలని స్టార్ యాంకర్లు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం కరోనా విజృంభణ దారుణంగా ఉంది.

 

IHG

 

సినిమా, టీవీ షూటింగ్ లకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. దీంతో జూన్ రెండో వారం నుండి సినిమా, టీవీ షూటింగ్ లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో బాగున్నప్పటికీ రెండు వారల తర్వాత కొందరు టీవీ నటులకు కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

IHG

 

దీంతో భయాందోళనకు గురైన కొందరు మరికొన్ని రోజులు పాటు ఇంట్లోనే ఉంటే మంచిది అని నిర్ణయించుకున్నారు. కొన్ని ఛానెళ్లు కూడా షూటింగ్‌లను తాత్కాలికంగా ఆపివేశాయి. అయినప్పటికీ కొన్ని షోలు, సీరియల్స్ షూటింగ్ లు కొనసాగుతున్నాయి. 

 

IHG

 

ప్రస్తుతం కొనసాగుతున్న షోస్ లో సుమ క్యాష్, అనసూయ జబర్దస్త్ కూడా ఉన్నాయి. గత మూడు వారాలుగా వీరు షోలో పాల్గొంటున్నారు. ఇంకా ఈ కరోనా విజృంభణ ఉండడంతో వారు కొద్దీ రోజులు పాటు షూటింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి వీరు నిజంగానే రిస్క్ ఎందుకని రెస్ట్ తీసుకుంటారా? లేక కొనసాగుతారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: