అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ 3 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. 15 మంది సెలెబ్రిటీలు పాల్గొన్న ఈ రియాలిటీ గేమ్ లో హేమ ఇప్పటికే ఎలిమినేటైనా సంగతి తెలిసిందే. హేమ ఎలిమినేట్ తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా ఈ షోలో జాయిన్ అయ్యింది.  ఇది వేరే విషయం అనుకోండి. అయితే, ఈ హేమ‌కు పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ సైతం ఉంది. ఏపీ ఎన్నికల్లో మంగళగరి నుంచి తమన్నా బరిలోకి దిగారు.ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు లోకేష్‌పై పోటీ చేశారు.
 
నామినేష‌న్ దాఖ‌లు చేసిన త‌ర్వాత ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొద‌టిసారి థర్డ్ జెండర్‌గా ప్రజా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని తన‌ను నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆశీర్వదించాలని కోరారు. జనసేన పార్టీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ పార్టీ నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు. ఇప్ప‌టి నుంచి మంగళగిరిలోనే అంద‌రికీ అందుబాటులో ఉంటానని ప్ర‌జాసేవ చేస్తాన‌ని చెప్పారు. టీడీపీ నుంచి మంగ‌ళ‌గిరి నుంచి పోటీచేస్తున్న మంత్రి నారా లోకేశ్‌కు తమన్నా సవాల్ విసిరారు. లోకేశ్‌కు దమ్ముంటే ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి... అప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి బ‌రిలో దిగాల‌ని సవాల్ విసిరారు. ఓటమి భయం వల్లే లోకేశ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంలేద‌ని విమర్శించారు.


కాగా, గ‌త ఎన్నిక‌ల్లో వామపక్షాలతో పొత్తులో భాగంగా మంగళగిరి సీటును పవన్ కమ్యూనిస్టులకు ఇవ్వ‌డంతో తమన్నా ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగింది. అప్పటి మంత్రి నారా లోకేష్‌పై తమన్నా పోటీకి దిగడంతో మీడియా బాగా ప్రచారం చేసింది. లోకేశ్‌పై ట్రాన్స్‌జెండర్ పోటీ అంటూ తమన్నాను ఆకాశానికి ఎత్తేసింది. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే తమన్నాకు 50 ఓట్లు కూడా రాలేదు. రాష్ట్రంలో మొద‌టిసారి థర్డ్ జెండర్‌గా ప్రజా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని ఆమె చేసిన ప్ర‌క‌ట‌న‌కు ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. తాజాగా మ‌రోమారు బిగ్‌బాస్‌3తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: