బుల్లితెరపై జబర్దస్త్ చేసిన అద్బుతం ఏంటో అందరికీ తెలిసిందే. గురు,శుక్ర వారాల్లో టీవీల్లో జబర్దస్త్ కమెడియన్లు చేసే కామెడీ  అంతా ఇంతా కాదు. పటాసుల్లాంటి పంచులు బాంబులుగా పేలుస్తూ అందరిలోనూ నవ్వులు పూయిస్తారు. దీనికి తోడు రష్మి-సుధీర్ జంటకు జనాల్లో బీభత్సమైన క్రేజ్ ఉంది. ఇటీవలే జబర్దస్త్ స్టేజిపై కొత్త కెమిస్ట్రీ నడుస్తోంది. అదే యాంకర్ అనసూయ భారద్వాజ్  హైపర్ ఆది చేసే కామెడి అల్లరి..! గ్యాప్ లేకుండాపంచులేసే ఆది..ఈ మధ్య వరసగా అనసూయతో స్టెప్పులేస్తున్నాడు. స్కిట్‌లోనూ ఆమెతో డైలాగ్‌లు కొన్ని పంచులు   చెప్పిస్తున్నాడు. దాంతో రష్మి-సుధీర్ మాదిరిగానే.. అనసూయ-ఆది జంటకు ఫాలోయింగ్ పెరుగుతోంది.

వీరిద్దరి కెమిస్ట్రీపై జోరుగా చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ఆది-అనసూయ జంటపై జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. స్కిట్‌లో ఏదైనా ఒక బిట్ జనాల్లోకి బాగా చొచ్చుకు  వెళ్తే.. అలాంటి వాటిపై డైరెక్టర్‌,రైటర్స్  స్కిట్‌లు రాస్తారని చెప్పుకొచ్చారు. ఆది-అనసూయ కెమిస్ట్రీ కూడా ఆ రేంజ్ లో పేరు రావడం అలాంటిదేనని స్పష్టం చేశారు. తామంతా ఒక కుటుంబమని.. అనసూయను తమ సోదరిగా, కూతురిగా చేసుకుంటామని ఏది చేసినా రేటింగ్ కోసమే అని  స్పష్టంచేశారు.


అనసూయ-హైపర్ ఆది, సుడిగాలి సుధీర్-రష్మీ కెమిస్ట్రీపై ఎక్కువగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా దానికి వచ్చే రేటింగ్ ని అలాగే కొనసాగిస్తారు. ఇంకొన్ని ఎపిసోడ్‌లు కూడా బాగా ప్లాన్ చేస్తారు. అంతేతప్ప అందరిలోనూ స్నేహ సంబంధమే ఉంటుంది. మాకు, జడ్జిలకు తల్లిదండ్రులు-పిల్లలకుండే ప్రేమనుబంధమే ఉంటుంది. అనసూయ నన్ను బాబాయ్ గారు అని పిలుస్తుంది. జబర్దస్త్‌లో సోదర సోదరి భావాలేే ఎక్కువగా ఉంటాయి. అనసూయను చెల్లి, అక్కగా ఆప్యాయయంగా చేసుకుంటాం కానీ వేరే ఉద్దేశాలు లేవని వారు చెప్పారు. అంతేతప్ప కెమిస్ట్రీ రొమాన్స్ తొక్క తోలు లాంటివి ఏమి లేవు అంటూ భూతద్దంలో చూడొద్దు. అని రాజు స్పష్టం చేశారు.


నాగబాబు చాలా మంచివారని చెప్పారు రాజు. ఇటీవల జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్‌కు కిడ్నీ సమస్య వచ్చిందని.. అప్పుడు అందరి నుంచి డబ్బులు కలెక్ట్ చేసి సాయం చేశారని వెల్లడించారు. జబర్దస్త్ టీమంతా ఒక కుటుంబమని ఎన్ని సమస్యలు వచ్చినా మాలో మేమే చూసుకుంటాం అని చెప్పారు. ఏ సమస్య వచ్చినా శ్యామ్ ప్రసాద్ గారు, నాగబాబు గారు తమకు అండగా ఉంటారని తెలిపారు  రాజు. జనాల వల్లే తాము బతుకుతున్నామని వారే మాకు దేవుళ్ళు అని చెప్పారు. జనాన్ని హర్ట్ చేసే పనులు ఎప్పుడూ చేయమని స్పష్టచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: