బిగ్ బాస్ హౌస్  నుంచి గత వారం ఎలిమినేషన్ ఎదుర్కొని బయటకు వచ్చిన సీరియల్ యాక్టర్  రవికృష్ణ బిగ్ బాస్ హౌస్ మేట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పునర్నవి, రాహుల్ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు రవి.   రాహుల్, పునర్నవి మధ్య ఏమి లేదని .... నిజానికి వాళ్లిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని రవికృష్ణ చెప్పుకొచ్చారు.   రాహుల్ మాత్రం  కేవలం గేమ్ లో తాను  గేమ్ లో ఉండటం కోసమే పునర్నవితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడని తన అభిప్రాయం బయటపెట్టేసాడు.


అంతేకాదు పునర్నవికి, నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నాడు. రెండు, మూడు సందర్భాలలో మినహా పునర్నవితో తనకు ఎలాంటి గ్యాప్ లేదని రవి అన్నాడు.  కానీ మా ఇద్దరి  రిలేషన్ ను విడగొట్టింది..మాత్రం రాహులేఅని అన్నాడు.  తాము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని అయితే రాహుల్ ఇది జీర్ణించుకోలేక తరచూ తనతో ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ కోల్డ్ వారకు తెరలేపాడని రవి తన బాధను వెళ్లగక్కాడు. 

చివరికి  రాహుల్ తో క్లోజ్ అయిన తర్వాత పునర్నవి కూడా తనతో మాట్లాడటం మానేసిందని రవి బాధపడ్డాడు.అందుకే నన్ను అర్ధం చేసుకొని తనే  మళ్లీ మాట్లాడుతుందనే ఉద్దేశ్యంతో పునర్నవి ని దూరం పెట్టాడనని రవి తెలిపాడు. తాను లేని సమయంలో తన గురించి చేసిన కామెంట్స్ హోస్ట్ నాగార్జున ప్లే చేసి వినిపించడంతో తాను షాక్ కు గురయ్యానని చెప్పుకొచ్చాడు.

అప్పుడు   పునర్నవి తన గురించి ఆలా  నెగిటివ్ గా మాట్లాడటం చూసి చాలా హర్ట్ అయ్యానని రవికృష్ణ చెప్పుకొచ్చాడు. ఫలితంగా తాను కేవలం శివజ్యోతితో మాత్రమే కంఫర్ట్ ఫీల్ అయ్యేవాడినని రవికృష్ణ తన బాధంతా ఏకరువు పెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: