సినిమాలు అంటే పది మందికి ఎంట్రటైన్ మెంట్ చేసేలా ఉండాలి కానీ..పది మందికి కించపరుస్తూ..అసభ్యకరమైన వ్యవహారాలతో ఉండకూడదూ..కానీ నేటి సినీ ప్రపంచం అశ్లీలానికి పెద్ద పీట వేస్తూ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వస్తున్నాయని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.  గత కొంత కాలంగా వెండితెర, బుల్లితెరపై వస్తున్న సినిమాలు, సిరియల్స్, ఇతర లైవ్ షోలు ద్వందార్థాలతో చండాలమైన బూతు కామెంట్లతో వస్తున్నాయని..అంతే కాదు ఆడియో వేడుకల్లో, కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో యాంకర్లు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అసభ్యకరంగా మాట్లాడటం ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నాయిన వారు అంటున్నారు.  
Image result for jabardasth comedy show
తాజాగా రారండోయ్ వేడుక చూద్దం ఆడియో వేడుకలో సీనియర్ నటులు చలపతిరావు అమ్మాయిలు పక్కలోకి పనికి వస్తారు అన్న మాట సోషల్ మీడియాతో పెద్ద దుమారమే చెలరేగింది.  దీనిపై మహిళా సంఘలు, మహిళా నేతలు పోలీస్ కేసు కూడా పెట్టారు.  గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీ వారు ఆడవారి పట్ల అమర్యాదగా నడుచుకుంటున్నారని..కొన్ని టీవి ప్రోగ్రామ్స్ తో యువత పెడదోవ పడుతుందని ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా బూతు కామెంట్లు చేస్తున్న ‘జబర్దస్త్’, ‘పటాస్’ షోలను రద్దు చేయాలని మహిళ సంఘాల అధ్యక్షురాలు సజయ కోరుతున్నారు.
Image result for patas program
ఈ విషయమై మీడియా ముందుకొచ్చిన ఆమె.. ఆయా షోలపై మండిపడ్డారు. అలాగే ఈ ఇంటర్వ్యూకి హాజరైన నటి హేమ, దర్శకుడు శంకర్ సైతం ఆమెకి మద్దతు పలికారు. అవసరమైతే అలాంటి షోలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని కఠినంగా శిక్షించాలని ఆయా షో నిర్వాహకులు, నటీనటులపై మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: