సినిమా.. ఇదో రంగుల ప్రపంచం.. ఈ రంగంపై ఆసక్తితో హైదరాబాద్ రైలో బస్సో ఎక్కే ఔత్సాహికులెందరో.. నేరుగా ఫిల్మ్ నగర్ చేరుకుని ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగాక కానీ తమ కలలు నిజం కావడం ఎంత కష్టమో అర్థమవుతుంది వారికి. అయితే పట్టుదలతో తమ కల నెరవేరేందుకు ఎన్ని కష్టాలైనా భరించి ఓపిగ్గా ఎదురుచూసే వారిని సినీ తల్లి కరుణిస్తూనే ఉంటుంది. 

Image result for jabardasth rp

అలా నెల్లూరు నుంచి హైదరాబాద్ మకాం మార్చిన ఔత్సాహికుల్లో జబర్దస్త్ ఆర్పీ ఒకరు. ఇతని పూర్తి పేరు రాటకొండ ప్రసాద్.. జబర్దస్త్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ నెల్లూరు యాసలో కామెడీ పండిస్తాడు.. కాళ్లు రెండూ గాల్లోకి ఎగరేసి ఒకదానికొకటి తాకించడం వంటి విన్యాసాలతో అలరిస్తుంటాడు. 

Image result for jabardasth rp

ఐతే.. ఆర్పీ ఇండస్ట్రీకి వచ్చిది నటుడవుదామని కాదట. పెద్ద డైరెక్టర్ కావాలన్నది అతని డ్రీమ్.  డిగ్రీ పూర్తయ్యాక సినిమాలపై మోజుతో హైదరాబాద్ కు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడట. ‘సాధ్యం’, ‘గురుడు’, ‘గేమ్’ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడట. ఆ సమయంలోనే జబర్దస్త్ లో అవకాశం వచ్చిందట. ఇప్పటివరకూ ఆ జబర్దస్త్ లో 270 స్కిట్స్ వరకూ చేశాడట ఆర్పీ. 

Related image


ప్రస్తుతానికి జబర్దస్త్ బాగానే ఉన్నా.. తన లక్ష్యం మాత్రం పెద్ద డైరెక్టర్ కావడమేనంటున్నాడు ఆర్పీ. జబర్దస్త క్రేజ్ పుణ్యమాని అని సినిమాల్లోనూ బాగానే చాన్సులొస్తున్నాయట. ఇప్పటివరకూ పది సినిమాల్లో నటించాడట. ప్రస్తుతం ఓ పెద్ద సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నాడట. ఓసారి కమెడియన్ గా పేరొచ్చాక మళ్లీ దర్శకత్వం అంటే కష్టమే. అయినా ఆర్పీ కోరిక తీరాలని ఆశిద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: