బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షోస్ లో ఒకటి 'బిగ్ బాస్'. బిగ్ బాస్ రెండు సీజన్ ని ఎంతో చక్కగా కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1 లో శివబాలాజీ టైటిల్ ని సొంతం చేసుకోగ దానికి హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నిర్వహించారు.సీజన్ వన్ లోని ప్రతీ ఒక్క కంటిస్టెంటు చాలా చక్కగా ఆడారు.తరువాత వచ్చిన సీజన్ 2 లో మన నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు.
ఇది సీజన్ వన్ అంత హిట్ అవ్వకపోయినా ఎంతో కొంత పేరును తెచ్చిపెట్టాయి.ఈ సీజన్ 2 లో కౌషల్ టైటిల్ దక్కించుకున్నారు.సీజన్ వన్ లో మొత్తం ఫిలిమ్ వార్నే తీసుకోగ, సీజన్ టూలో కొత్త గా కామన్ మ్యాన్ వాళ్లని కూడా తీసుకున్నారు. సీజన్ 2 ఎన్నో గొడవలతో అల్లర్లతో పూర్తి చేసుకుంది. ఇప్పుడు కొత్తగా సీజన్ 3 కూడా స్టార్ట్ అవుతుంది. దీనికి హోస్ట్ గా అక్కినేని నాగార్జున గారు చేస్తున్నారు.
కానీ సీజన్ 3 స్టార్ట్ కాక ముందే ఎన్నో వివాదాలనూ మరోవైపు నినాదాలనూ ఇంకోవైపు ధర్నాలతో నిరసనలకు గురై,ప్రేక్షకుల్లో ఎంతో హాట్ టాపిక్ గా మారింది.ఈ సీజన్ 3 పైన జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్త ఆరోపణలు చేయటం, కేసులు పెట్టటం చివరికి దేశ రాజదానిలో ధర్నాకి దిగటంతో షో అసలు స్టార్ట్ అవుతుందా లేదా అనే అందరూ అనుకున్నారు.కానీ బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం అనుకున్న డేట్ నే జరుగుతుంది.
హౌస్ లో ఆర్డర్స్ వేసే బిగ్ బాస్ ను ఎవరూ ఆపలేరని చెప్పిన సమయానికే బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అవుతుందని తెలిపారు. రెండు సీజన్ లతో పోల్చుకుంటే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 3 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.సీజన్ 3 లో మన కింగ్ నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరించడం అందరిలో తెలియని ఉత్సాహాన్ని రేపింది. బుల్లితెర పై సందడి చేసే అనుభవం ఉన్న నాగ్, ఈ రియాల్టీ షోను కూడా సక్సెస్ చేస్తాడనే అందరూ అనుకుంటున్నారు.
హోస్ట్ విషయయంలో అధికారికంగా తెలిపిన స్టార్ మా బృందం కంటిస్టెంట్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే పదిహేను మంది కంటెస్ట్ంట్ లు వీరే అంటూ ఎన్నో పుకార్లు కూడా వచ్చాయి.వంద రోజుల పాటు సాగే ఈ షోలో పాల్గొనబోయే వారంటూ తీన్మార్ సావిత్రి, జర్నలిస్టు జాఫర్, యాంకర్ శ్రీముఖి, నటీమణులు హేమ, హిమజ, ఉయ్యాల జంపాల ఫేం పునర్ణవి భూపాలం, వరుణ్ సందేశ్, అతడి భార్య వితికా షేరు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, భరణి, దుర్గ, అషూరెడ్డి(డబ్స్మాష్ స్టార్), రఘు మాస్టర్, ఫన్ బకెట్ మహేష్ విట్టా, అలీ రెజా, రవికృష్ణ లాంటి కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరందరిలో ఎవరెవరు మన బిగ్ బాస్ సీజన్ 3 హౌస్ లోకి వెళ్తున్నారో మరి కొన్ని గంటల్లో తెలియనుంది.