ప్రస్తుతం టీవీ వీక్షణం నిజంగానే ఖర్చుతో కూడుకున్నది అయిపొయింది. గతంలో మాదిరిగా ఏ రూ.100కో రూ.150కో అన్ని ఛానెళ్లను వీక్షించే అవకాశం వినియోగదారులకు లభించడం లేదు. ఇక ప్యాక్  విషయానికి వస్తే  సౌత్ ప్యాక్  నార్త్ ప్యాక్ స్పోర్ట్స్ ప్యాక్ మూవీ ప్యాక్... ఇలా ఏ ప్యాక్ తీసుకున్నా కూడా జేబు కాళీ అయ్యిపోవడం కాయం. ఏ ప్యాక్ తీసుకున్నా సరే  మనకు కవాల్సిన ఛానెళ్లు అన్ని  చూడాలంటే... అదనపు డబ్బు చెల్లించక తప్పదు. 


ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు పండగ బొనాంజాలా ఓ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు  ఆసక్తికర వార్తలు తెలియచేస్తునారు. రూ.130కే ఏకంగా 150 ఛానెళ్లను అందించేందుకు కేబుల్ ఆపరేటర్లు చేస్తున్న ప్రయత్నాలు  ఫలిస్తే.... కేబుల్ ద్వారానే ప్రసారాలు అందుకుంటున్న వినియోగదారులకు నిజంగానే దసరా బొనాంజా ఇచ్చినట్లే అని చెప్పావచు.


 కేబుల్ వినియోగదారులను అందరిని  ఆకర్షించే ఈ విషయంపై ఇప్పటిదాకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నపటికీ... కేబుల్ ఆపరేటర్ల సంఘం దీనికి డగట్టు తనవంతు ప్రయత్నాలు  ముమ్మరం చేసిందనే తెలుస్తుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ప్రొవైడర్లు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద రూ.130ను వసూల్ చేస్తున్న సంగతి  అందరికి తెలిసిందే. ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడిసిఎఫ్) ఇండియాలోని 80 శాతం కేబుల్ యూజర్లకు సేవలు అందిస్తున్న సంగతీ కూడా  తెలిసిందే.


ఈ ఫెడరేషన్ లో అనుమతి  కలిగి ఉన్న హాత్వే డిజిటల్ ఇన్డిజిటల్ సిటీ నెట్ వర్క్ జీటీపీఎల్ హాత్వే ఫాస్ట్వే ట్రాన్స్మిషన్ డీఈఎన్ నెట్ వర్క్ యూసీఎన్ కేబుల్ ఆర్టెల్ కమ్యూనికేషన్స్ ఐసీఎన్సీఎల్ ఏషియానెట్ డిజిటల్ కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ వారు  సమావేశం  కూడా అయ్యారు . ఇందులో భాగంగా రూ.130కే 150 ఛానెళ్లను యూజర్లకు అందించాలనన్న సంచలన విషయంపై చర్చ జరిపారు... ఆ దిశగా ఓ నిర్ణయం కూడా తీసుకున్నాము అని  ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్ఎన్ శర్మ తెలిపారు. అయితే ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ట్రాయ్ అనుమతి ఉందా? లేదా? అనేది ఇంకా బయటికి రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: