బిగ్ బాస్ మూడో సీజన్ ఇది ఇప్పుడు హాట్ టాపిక్ పైగా ముగుంపు దశకు కూడా వచ్చింది.పన్నెండో వారం నలుగురు నామినేట్‌ అయ్యారు. 

ఇంటి సభ్యులందరికి బిగ్‌బాస్‌ సోమవారం పార్కింగ్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా గూడ్స్‌ ట్రాలీని నిర్దేశిత ప్రాంతంలో పార్కింగ్‌ చేయాలి. 

పార్కింగ్‌ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నేరుగా నామినేట్‌ అవుతారు. తొలుత హౌస్ లో ఉన్న ఎనిమిది మంది ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ట్రాలీ ఇచ్చి. ఏడు పార్కింగ్‌ స్థలాలు మాత్రమే అందుబాటులో ఉంచారు. 

అలా నాలుగుసార్లు పార్కింగ్‌ స్థలాలు తగ్గిస్తూ ఉండటంతో నలుగురు సభ్యులు నామినేట్‌ అయ్యారు.అలా నామినేట్ అయిన వారితో గేమ్ మొదలు పెట్టారు బిగ్ బాస్.

మొదటగా వరుణ్‌, తర్వాత వితిక, అటు తర్వాత మహేశ్‌, చివరగా రాహుల్‌ పార్కింగ్‌లో చోటు దక్కించుకోలేదు. దీంతో ఈ నలుగురు నామినేట్‌ అయినట్టు బిగ్‌బాస్‌ స్పష్టం చేశారు. అయితే, పోయిన వారం జరిగిన టాస్క్‌లో వితిక బ్యాటిల్‌ ఆఫ్‌ మెడాలియన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌తో వితికకు ఒక వారం ఎలిమినేషన్‌ తప్పించుకునే అవకాశం దక్కింది దాంతో ఆనందానికి అంతే లేకుండా పోయింది అంట. అక్కడితో ఆగలేదు.ఇక సోమవారం జరిగిన టాస్క్‌లో వితిక ట్రాలీ పార్కింగ్‌ చేయడంలో విఫలం కావడంతో నామినేట్‌ అయింది. అయితే, ఈవారం మెడాలియన్‌ను వాడుకుని సేవ్‌ అవుతారా..? లేదంటే నామినేషన్‌లో ఉంటారా..? అని బిగ్‌బాస్‌ అడగ్గా.. వితిక మెడాలియన్‌తో సేవ్‌ అవుతానంది. దీంతో మిగిలిన ముగ్గురే నామినేట్‌ అయినట్టు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది.ఇటు బిగ్ బాస్ చూసే అభిమానుల్లో కూడా ఉదృక్త నెల్కొంది. చూద్దాం ఎవరు విజేత అవుతారో ఎవరు రన్నరప్ అవుతారో వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: