బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ వెంటే ఉండటం, ఆయనతోనే మాట్లాడటం.. మిగతా ఎవ్వరితోనూ కలవకపోవడం లాంటివి చేయడం, ఇద్దరూ కలిసే రాత్రంతా ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా వీరిద్దరే కనబడటంతో బాబా బంటు అని మహేష్కు ట్యాగ్ వచ్చేసింది.  బాబా బంటు అనే ట్యాగ్ పోవాలంటే అందరితో కలిసుండాలని నిశ్చయించుకున్న మహేష్ వరుణ్, రాహుల్, వితికా, పునర్నవిలతో బాగానే కలిసిపోయాడు. ఇక వీరితో క్లోజ్ గా ఉండేసరికి బాబాకు కాస్త దూరమయ్యాడు. 

అయితే దీనంతటికి కారణం శ్రీముఖే అని మహేష్ అభిప్రాయం. మళ్లీ బాబాతో మాట్లాడి మామూలు స్థితికి వచ్చేశాడువరుణ్, రాహుల్, పునర్నవి, మహేష్ ఎలిమినేషన్లో ఉండగా.. ఆ ముగ్గురిలోంచే ఒకరు పోతారని మహేష్ తెలిపాడు.నిజంగానే మహేష్ చెప్పినట్లు.. పున్ను ఎలిమినేట్ అయింది. వరుణ్, రాహుల్, వితికా, మహేష్ లు ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. నిన్నటి ఎపిసోడ్లోశ్రీముఖి, అలీ, శివజ్యోతి, బాబాలు మరోచోట కూర్చుని మాట్లాడుకోవడంతో  వీళ్లంతా ఒక గ్రూప్ క్లియర్ కట్ గా తెలిసిపోయింది.

నామినేట్ అయ్యాడు కాబట్టే.. ఆ గ్రూప్లో చేరాడుఅందుకే మహేష్ తనకునచ్చడంటూ అన్నది శ్రీ ముఖి. మీ  మీటింగ్స్ అయిపోయాయా అంటూ శ్రీముఖి సెటైర్ వేయగా... మాష్టర్ గురించే మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చాడు మహేష్. ఆ ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటూ. మనమే ఐదుగురం ఫైనల్కు వెళ్దామని మహేష్ అనగా.. మనది మనమే రీజన్స్ చెపుకుందామని శ్రీముఖి అంటూ.. నేను శివజ్యోతి పేరు చెబుతాను అది నాకు విలన్.. కిచెన్లో ఎప్పుడూ సహాయం చేయలేదంటూ.. చెప్పుకొచ్చింది.



 అయితే చివర్లో నామినేషన్స్ ఉండవంటూ అలీ పంచ్ వేశాడు. అలీ శివజ్యోతి నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుంటూ.. వరుణ్, రాహుల్, వితికా అవుతారని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అతి తెలివిని ప్రదర్శిస్తూ.. వీ, ఆర్ అంటూ బెడ్పై రాస్తూ.. అలీతో మాట్లాడుకొచ్చింది. అయితే ఆర్, వీ అంటూ అలీబయటకు మాట్లాడేసి.. ఇదేమన్నా పెద్ద సీక్రెటా? అని అన్నాడు. అయితే వారు మాట్లాడుకున్నట్లే.. రాహుల్, వరుణ్ నామినేషన్లోకి వచ్చారు. మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: